Breaking News

పేకాటరాయుళ్ళ అడ్డా…

నందిపేట్‌, అక్టోబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలకేంద్రంలోని ప్రభుత్వం సాంకేతిక కళాశాల పేకాట రాయుళ్లు, ఆకతాయిలకు అడ్డాగా మారింది. వివరాల్లోకి వెళ్తే నందిపేట మండలకేంద్రంలోని ప్రభుత్వ సాంకేతిక కళాశాల గతంలో బాలికల హాస్టల్‌ కోసం భవన నిర్మాణం చేపట్టారు. అప్పట్లో ప్రభుత్వ సాంకేతిక కళాశాలకు భవనం లేనందున కొన్నిరోజుల పాటు ఉపయోగంలోకి తీసుకున్నారు.

తర్వాత కళాశాలకు నూతన భవనం నిర్మాణం పూర్తి కాగానే అందులోకి మార్చుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది కాని… నాడు బాలికల హాస్టల్‌ కోసం నిర్మించబడిన భవనం కాస్త నిర్మానుష్యంగా మారింది. అప్పటి నుండి భవనాన్ని గాలికొదిలేశారు. లక్షలాది రూపాయలు వెచ్చించిన ప్రభుత్వ భవనాలు కాస్త ఇప్పుడు పేకాట రాయుళ్లకు అడ్డగా మారింది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగడమే కాకుండా, అక్కడే పేకటరాయుళ్లు మకాం వేస్తున్నారు. పేకాట ఆడటం మొదలుపెట్టారు.

దానికితోడు మధ్యం సేవించడం, మల మూత్ర విసర్జన చేయటం, మద్యం మత్తులో పభుత్వ ఆస్తులని కూడా చూడకుండా, భవనంలోని మరుగుదొడ్లను ధ్వంసం చేయటం లాంటి ఆకతాయి పనులు చేస్తున్నారు. త్రాగునీరు కోసం వేసిన బోరుబావిలో మోటారు కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిపోయారని, దగ్గరలోనే బస్తి వాసులు నివసించడం వలన తమ పిల్లలు చుట్టుపక్కల సంచరించడం జరుగుతుందని, తమ పిల్లలపై దుష్ప్రభావాన్నీ చూపే అవకాశముందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదంతా ఒకేత్తైతే దగ్గరలోనే ఉన్న కాలనీ వాసులు తమ పెంపుడు మేకలకు అక్కడే కట్టడం మరింత విచారకరంగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం ఏమి పట్టనట్టు వ్యవహారించడం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా దష్టి సారించి ఆకతాయిలకు అడ్డుకట్ట వేయాలని, అలాగే ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన అవసరముందని స్థానికులు అంటున్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *