Breaking News

చెత్త బుట్టల కోసం లక్ష విరాళం

బీర్కూర్‌, అక్టోబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని బరంగెడిగి గ్రామంలో మాజీ జెడ్పిటిసి ద్రోణ పల్లి సతీష్‌ ఆదివారం చెత్త బుట్టలు పంపిణీ చేశారు. అశోక్‌ తన సొంత డబ్బు లక్ష రూపాయలు వెచ్చించి బరంగెడిగి గ్రామానికి ఎనిమిది వందల చెత్తబుట్టలు తెప్పించారు.

ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ నిషేధించి స్వచ్ఛత గ్రామం వైపు అడుగులు వేయాలన్నారు. ప్రతి ఒక్కరూ చెత్తను బుట్టల్లో వేయాలన్నారు. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటామన్నారు.

కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అశోక్‌, జడ్పిటిసి స్వరూప శ్రీనివాస్‌ యాదవ్‌, ఎంపీపీ రఘు, వైస్‌ ఎంపీపీ కనిగిరి కాశీరాం, కో ఆప్షన్‌ సభ్యులు ఆరిఫ్‌, బీర్కూరు ఎంపీటీసీ సందీప్‌ పటేల్‌, బరంగెడిగి సర్పంచ్‌ పసుపుల లక్ష్మీ, రమేష్‌, ఎంపిటిసి కుమ్మరి గంగామణి, గంగారాం ఉప సర్పంచ్‌ నాచారం రాములు, సొసైటీ చైర్మన్‌ రాజప్ప, టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు నా గొండ, టిఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *