Breaking News

పిడుగుపాటుకు ఏడు పశువులు మృతి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మామిడిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఏడు పాడి పశువులు మృతి చెందాయి. వీటిలో మూడు పశువులు నిండు చూలుతో ఉండి కొన్ని రోజుల్లో ఈనే పశువులు. కాగా రెండు పశువులు ఇటీవలే ఈని పాలు ఇస్తున్న పశువులు. మిగిలిన రెండు పశువులు మేలు జాతి పెయ్యలు. పాడి పశువులు మృతి చెందడంతో పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుమారు నాలుగు లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని ఆర్మూర్‌ పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్‌ లక్కంపల్లి ప్రభాకర్‌ తెలిపారు. వేంపల్లి నడిపోల్ల పెద్ద రాజన్నకు చెందిన మూడు పశువులు, చిట్యాల పెద్ద రాజుకు చెందిన ఒక పశువు, వెల్మల మాణిక్యంకు చెందిన ఒక పశువు, వేంపల్లి శివకు చెందిన రెండు పశువులు ఉన్నాయి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన వారిలో పిప్రి పశువైద్యాధికారిణి డాక్టర్‌ శైలజ, గ్రామ విఆర్వో రమేశ్‌ ఉన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *