Breaking News

స్వదేశానికి స్పీకర్‌

బాన్సువాడ, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారిక విదేశీ పర్యటన ముగించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా స్పీకర్‌ ఉగాండా దేశ రాజధాని కంపాల నగరంలో జరిగిన 64 వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు సెప్టెంబర్‌ 25న హైదరాబాద్‌ నుండి బయలుదేరి వెళ్ళారు.

అనంతరం యూరప్‌లో పర్యటించి లండన్‌ నుండి శనివారం ఉదయం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. స్వదేశానికి విచ్చేసిన స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి విమానాశ్రయంలో బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు.

Check Also

పోచారం ట్రస్టు ఆధ్వర్యంలో బియ్యం, నిత్యవసర సరుకుల‌ పంపిణీ

బాన్సువాడ, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి నివారణకు విధించిన లాక్‌ డౌన్‌ నేపధ్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *