Breaking News

ప్రణాళికలో పాలుపంచుకున్న అందరికి కృతజ్ఞతలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లెల సమగ్రాభివ ద్ధికి 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక ప్రణాళిక ఎంతగానో దోహదపడిందని ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రతినిధులు అధికారులు కషితో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. జిల్లాలో సెప్టెంబర్‌ ఆరవ తేదీ నుండి అక్టోబర్‌ 5వ తేదీ వరకు నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో ఆశించిన ఫలితాలు వచ్చాయని ముఖ్యంగా ప్రణాళికలో అందరు తమ గ్రామాభివద్ధికి ముందుకు వచ్చి ముఖ్యంగా గ్రామాలను పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండాలనే సంకల్పంతో పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వచ్చే విధంగా చేశారని చెప్పారు.

నెల రోజుల పాటు పారిశుద్ధ్యం పచ్చదనం పవర్‌ వీక్‌ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టినట్లు గ్రామాభివద్ధికి విరాళాలు ఇచ్చి చేయూత నందించిన దాతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో పారిశుద్ధ్య పరిసరాల పరిశుభ్రతపై ఎక్కువ చర్యలు తీసుకున్నట్లు, సంపూర్ణ ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా తయారు చేయడానికి ముందుకు వచ్చినట్లు ప్లాస్టిక్‌ వ్యర్ధాలను నిల్వ చేయడానికి ప్రత్యేక ప్లాస్టిక్‌ కనెక్షన్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, రోడ్లపై గుంతలను పూడ్చి వేయడం జరిగిందని, ముఖ్య కూడలి వద్ద చెత్తకుండీలను ఏర్పాటు, కొన్ని గ్రామ పంచాయతీలలో ఇంటింటికి చెత్త కుండీలను పంపిణీ చేయడం జరిగిందని, 204 గ్రామాలలో వైకుంఠ దామం నిర్మాణాలకు స్థలాలను గుర్తించినట్లు ఇంకను 52 గ్రామాలలో గుర్తించవలసి ఉన్నదని, కొత్తగా ఏర్పడిన 123 గ్రామపంచాయతీలలో డంపింగ్‌ యార్డులను గుర్తించినట్లు, ఇంకను 67 గ్రామాలలో స్థలాలను గుర్తించవలసి ఉందని తెలిపారు.

పవర్‌ వీక్‌ కార్యక్రమంలో భాగంగా 1848 విద్యుత్‌ స్తంభాలు తొలగించి సిమెంట్‌ స్తంభాలను ఏర్పాటు, వంగిన 1579 స్తంభాలను ఏర్పాటు తుప్పు పట్టిన 832 కొత్త సిమెంట్‌ స్తంభాలను ఏర్పాటు, 11088 ఎల్‌ఈడీ లైట్లను, 8145 స్తంభాలకు మూడవ వైర్లను ఏర్పాటు చేశామన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఒక కోటి 54 లక్షల మొక్కలు నాటి నట్లు, వాటి సంరక్షణకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరంలో గ్రామాలలో హరిత ప్రణాళికను సిద్ధం చేసి 25 లక్షల మొక్కలను నర్సిలలో పెంచుటకు నిర్ణయించామన్నారు.

ముఖద్వారం నుండి చివరి వరకు రోడ్డులో ఏవెన్యు ప్లాంటేషన్‌ చేసి ట్రీ గార్డ్‌ కంచెలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆర్థికపరమైన విధుల్లో భాగంగా జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 17 కోట్ల 53 లక్షల 14 వెల 6 వందల రూపాయలు కేటాయించినట్లు అందులో 14వ ఆర్థిక సంఘం ద్వారా 10 కోట్ల 49 లక్షల 81 వేల 900 రూపాయలు ఎస్‌ఎఫ్‌సి ద్వారా 7కోట్ల 3లక్షల 32 వేల 700 రూపాయలు తలసరి ఒక్కరికి 166.77 రూపాయల చొప్పున జిపిలకు సర్దుబాటు చేసినట్లు కలెక్టర్‌ చెప్పారు.

పల్లెల్లో సమగ్ర నూతన మార్పులను తెచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికలు పారిశుద్ధ్యంపై ఆసక్తిగల 1432 మంది వ్యక్తులు 48.64 విరాళాలు అందించినట్లు కులస్పూర్‌ తండ యందు 4 వందల గజాలు గల స్థలం డంపింగ్‌ యార్డ్‌ నిర్మాణం విరాళంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు ట్రీ గార్డులు డస్ట్‌ బిన్‌లు, చెత్తను తొలగించేందుకు గ్రామపంచాయతీ పాత ట్రాక్టర్లు అందించిన అందరి దాతలకు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కతజ్ఞతలు తెలిపారు.

గ్రామాల్లో ప్రత్యేక ప్రణాళికలో భాగంగా స్థానిక ప్రజా ప్రతినిధులు స్టాండింగ్‌ కమిటీ సభ్యులు స్వయం సహాయక సంఘ మహిళలు, అంగన్వాడి, ఆశ వర్కర్లు, మహిళలు, యువకులు, ప్రజలు శ్రమదానం చేసి పరిశుభ్రమైన వాతావరణం కల్పించినందుకు కలెక్టర్‌ అభినందించారు.

30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో ప్రజా ప్రతినిధులు, మండల, గ్రామ స్పెషల్‌ అధికారులు, గ్రామస్థాయి అధికారులు, ప్రజలు, యువకులు ముందుకు వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ ఈ సందర్భంగా కతజ్ఞత తెలియజేస్తూ జిల్లా కలెక్టర్‌ ఈ సందర్భంగా తెలిపారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *