Breaking News

ప్రభుత్వం మెడలు వంచాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌టీసీ కార్మికులపట్ల నిర్లక్షం వహిస్తున్న ప్రభుత్వం మెడలు వంచాలని, కార్మికుల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు డిమాండ్‌ చేశారు. శనివారం జరిగిన నిరసన కార్యక్రమంలో కార్మికులను ఉద్దేశించి ప్రసంగిచారు.

ఆర్‌టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలనీ, ప్రభుత్వం సంస్థకు చెల్లించవలసిన రెండు వేల కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సిబ్బందికి ఉద్యగభద్రత కల్పించాలని, ప్రభుత్వానికి వ్యతిరేకముగా నినాదాలు చేసారు.

కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్‌ కరంగుల అశోక్‌ రెడ్డి, దాత్రిక సత్యం, కన్నయ్య, మాజీ మున్సిపల్‌ కౌన్సిలర్‌లు చాట్ల రాజేశ్వర్‌, జమీల్‌, బట్టు మోహన్‌, గొనె శ్రీనివాస్‌, తేజాపు ప్రసాద్‌, మల్లేష్‌ యాదవ్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, ముదాం రమేష్‌, నాని, అబ్దుల్‌ జమీల్‌, కోటిపల్లి రామ్మోహన్‌, అహిమద్‌ సిద్ధికి, కార్యాలయ కార్యదర్శి లక్కపత్ని గంగాధర్‌, నారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *