Breaking News

ప్రణాళిక ముగిసింది

నందిపేట్‌, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రణాళిక పనుల ముగింపు కార్యక్రమలు ఆర్భాటంగా జరిగాయి. గాదేపల్లి గ్రామ పంచాయతీ లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం సఫాయి కార్మికులను, అంగన్‌వాడీ టీచర్లను, వర్కర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ నక్కల భూమేష్‌ మాట్లాడుతూ గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడం కోసం ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు.

గ్రామాలు అభివద్ధి చేయడమే లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సిహెచ్‌ కొండూరు గ్రామంలో సర్పంచ్‌ ప్రభాకర్‌, ఎంపిటిసి రాజు పాల్గొన్నారు. వెల్మల్‌ గ్రామంలో గ్రామ ప్రత్యేక అధికారి హన్మంత్‌ రెడ్డి పాల్గొని 30 రోజుల ప్రణాళిక నిరంతరం జరిగే కార్యక్రమమని, ప్రణాళిక పనులను స్ఫూర్తిగా తీసుకుని తమ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *