Breaking News

కార్మికుల సమ్మెకు టిఎన్‌ఎస్‌ఎఫ్‌ మద్దతు

కామారెడ్డి, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు టిఎన్‌ఎస్‌ఎఫ్‌ పూర్తి మద్దతును తెలియజేస్తుందని రాష్ట్ర కార్యదర్శి బాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల న్యాయబద్ధమైన కోరికలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెరవేర్చనందుకే కార్మికులు సమ్మెకు వెళ్లడం జరిగిందని, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్నామంటే తాత్కాలిక కార్మికులతో విధులను నిర్వహించడం సిగ్గుచేటన్నారు.

ట్రస్మ నాయకులు ప్రైవేట్‌ పాఠశాలల బస్సులను నడపడం సిగ్గుచేటన్నారు. ట్రస్మా టిఆర్‌ఎస్‌ పార్టీకి ఏజెంట్‌గా వ్యవహరిస్తుందని ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రైవేటు పాఠశాల బస్సులు నడపడం మానుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కమిటీ సైతం పూర్తి మద్దతు తెలియజేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో టిఎన్‌ఎస్‌ఎఫ్‌ కామారెడ్డి పట్టణ అధ్యక్షులు ఆకుల శివ కష్ణ, నాయకులు రాజు, నవీన్‌, సందీప్‌, సతీష్‌, వంశీ తదితరులున్నారు.

Check Also

కామారెడ్డి మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌గా చాట్ల రాజేశ్వర్‌

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి, ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *