Breaking News

బంద్‌కు టిజివిపి మద్దతు

కామారెడ్డి, అక్టోబర్‌ 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికై తెలంగాణ బందుకు టిజివిపి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల నవీన్‌ తెలిపారు. ఈ మేరకు కామారెడ్డి ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రజాస్వామ్యబద్ధంగా ఆర్టీసీ కార్మికుల హక్కులకై 14 రోజులు గా శాంతియుతంగా సమస్యలు పరిష్కరించాలని సమ్మె నిర్వహిస్తే కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా కనీసం కార్మికులను పిలిచి చర్చలు జరపకుండా కాలయాపన చేయడం కేసీఆర్‌ నియంత పాలనకు నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆర్టీసీని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆర్టీసీ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు.

50 వేల కుటుంబాలకు అన్యాయం జరిగితే యావత్‌ తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు కెసిఆర్‌ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. శనివారం బందుకు విద్య, వ్యాపార, వాణిజ్య, వైద్యం, రవాణా, న్యాయ సేవ అన్ని వర్గాల వారు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికై సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నితిన్‌ కుమార్‌, భాను చందర్‌, అర్జున్‌, నరేష్‌, భూపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

600 మంది వల‌స కార్మికుల‌కు అన్నదానం

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా జాతీయ రహదారి 44, జంగంపల్లి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *