Breaking News

సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాధించాలని సంకల్పం ఉంటే ఎన్ని సవాళ్లనైనా అధిగమించి విజయం సాధించవచ్చని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. శనివారం కలెక్టరేట్‌ మైదానంలో రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్రస్థాయి ఆరవ కుస్తీ పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన ఎందరో క్రీడాకారిణిలు అందుబాటులో ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని సదుపాయాలు లేకున్నా కూడా సర్దుకొని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విజయాలను అందుకున్నారని తెలిపారు. సౌందర్య, మాలవత్‌ పూర్ణ, నిఖత్‌ జరీన్‌ తదితరులు జిల్లాస్థాయిని ఇనుమడింప చేశారని తెలిపారు. వారితో పాటు వారి తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు తీసుకు వచ్చారన్నారు.

వారిలో ఉన్న సంకల్పబలం వారిని ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఎన్ని అవరోధాలు ఎదురైనా కూడా ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్లి అనుకున్నది సాధించాలని తెలిపారు. తద్వారా జిల్లా క్రీడా మైదానం అంతర్జాతీయ స్థాయికి గుర్తింపు వచ్చిందన్నారు. రెజ్లింగ్‌ క్రీడాకారులు కూడా జిల్లా రాష్ట్రస్థాయిలో వారి ప్రతిభను కనబర్చి మరింత మెరుగుగా రూపుదిద్దుకోవడానికి కషిచేయాలని ఉన్న సదుపాయాలను సద్వినియోగం చేసుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని తద్వారా వారికి, తల్లిదండ్రులకు, జిల్లాకు పేరుప్రఖ్యాతులు తీసుకురావాలని ఆయన సూచించారు.

కార్యక్రమంలో ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ ఆకుల లలిత, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, నిజామాబాద్‌ కరీంనగర్‌ డివైఎస్‌ఓ లు బాబురావు, అశోక్‌, మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు రాజేందర్‌ రెడ్డి, నర్సింగరావు, వెంకటేశ్వరరావు, పలు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆసరా పించన్‌ల పంపిణీ

నందిపేట్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని తపాలా కార్యాలయానికి ఆసరా పింఛన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *