Breaking News

రైతులకు రుణ మంజూరులో ఉదారంగా ఉండాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంటలు సాగుచేసే రైతులకు పంట రుణాలు మంజూరు చేయడంలో ఉదారంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి బ్యాంకర్స్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత రంగాలకు రుణాల మంజూరులో సంతప్తికరమైన లక్ష్యాలు సాధించలేదని ఆయన తెలిపారు.

రూ. 1751 కోట్లకు గాను 21.58 శాతంతో కేవలం 378 కోట్లు రూపాయలు మాత్రమే మంజూరు చేశారని తెలిపారు. కేవలం రుణాలపైనే వ్యవసాయం చేసే రైతులు బ్యాంకుల వైపు చూస్తారని తెలిపారు. అన్నదాతలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉందని, వారికి వీలైనంత ఎక్కువగా అవసరమైన సమయంలో రుణాలు అందించి వారు పంటల సాగులో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా సహకరించాలని కోరారు.

మరోవైపు ప్రాధాన్యేతర రంగాలకు అనుకున్న లక్ష్యాన్ని మించి రుణాలు మంజూరు చేయడంపై ఆయన సంతప్తి వ్యక్తం చేశారు. అయితే రైతు రుణాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పథకాలకు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలకు యంత్రాంగం మంజూరుకు అనుగుణంగా రుణాలు ఇచ్చి వాటి గ్రౌండింగ్‌ సకాలంలో జరిగేలా చూడాలని ఆయన తెలిపారు. వచ్చే రబీకి, ఆ తర్వాత వచ్చే ఖరీఫ్‌కు అయినా సకాలంలో లక్ష్యానికి అనుగుణంగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.

పంటల బీమాకు సంబంధించి రైతులకు అవగాహన కల్పించాలని, వారు బీమా చేసుకునే విధంగా అన్ని వివరాలు తెలియచేయాలని, అంటే నష్టానికి పరిహారం పొందే విధంగా రైతులకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రుణాల మంజూరులో పై స్థాయి బ్యాంకు అధికారులు ఉదారంగా ఉన్నప్పటికీ, ఆర్‌బిఐ ఆదేశాలున్నప్పటికీ బ్యాంకు బ్రాంచ్‌ స్థాయి అధికారులు మరింత బాగా పని చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని ఆయన ఆదేశించారు.

ఐకెపి, మెప్మా, రుణాలను కూడా మరింత అధికంగా సకాలంలో మంజూరు చేసేలా చూడాలన్నారు. అదేవిధంగా మరోవైపు రుణ బకాయిలు పెండింగ్‌ లేకుండా కూడా చూసుకోవాలని తెలిపారు. డిపాజిట్ల పరంగా నిజామాబాద్‌ జిల్లా మంచి స్థాయిలో ఉన్నప్పటికీ మరింత ఎక్కువ డిపాజిట్లు సాధించడానికి కూడా కషి చేయాలని ఆయన సూచించారు.

సమావేశంలో ఎల్‌డిఎం జయ సంతోషి, బ్యాంకుల అధికారులు ఏఎం ఖాన్‌, వాసుదేవరావు, సత్యనారాయణ, పాణిగ్రాహి, డిఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌, జిల్లా అధికారులు శశికళ, వాజిద్‌ హుస్సేన్‌, సమ్మయ్య, రాములు, సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆసరా పించన్‌ల పంపిణీ

నందిపేట్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని తపాలా కార్యాలయానికి ఆసరా పింఛన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *