Breaking News

ఆలయ శిఖర ప్రతిష్టాపన

రెంజల్‌, అక్టోబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలోని నల్ల పోచమ్మ, పెద్ద పోచమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ గోపురాలకు శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. దేవతామూర్తులకు వేదమంత్రోచ్ఛారణల మధ్య అత్యంత వైభవంగా శిఖర ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.

వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యజ్ఞం నిర్వహించారు. గత రెండు రోజుల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సునీత నర్సయ్య, ఎంపీటీసీ లక్ష్మీ లింగారెడ్డి, అలయకమిటి అధ్యక్షుడు రవీందర్‌ గౌడ్‌, గ్రామస్తులు, దత్తురెడ్డి, దత్తుపటేల్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సుధాకర్‌, శ్రీనివాస్‌, నర్సయ్య, లింగారెడ్డి, ప్రవీణ్‌, నరేష్‌, విఠల్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

సీఎం సహాయనిధి చెక్కు అందజేత

రెంజల్‌, డిసెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన నరేష్‌ అనారోగ్యానికి గురి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *