Breaking News

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి డైరెక్టర్‌ మహమ్మద్‌ అలీ ముర్తుజా ఉద్బోదించారు. పాజిటివ్‌ దక్పథం, క్రమశిక్షణతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అన్నారు. నిజామాబాదు నగరంలోని ప్రధాన్‌ మంత్రి కౌషల్‌ కేంద్రంలో శనివారం వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం ఆద్వర్యంలో కలాం వారోత్సవాల ముగింపు సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా యువ సాధికారత, విజన్‌ 2020 అనే అంశాలపై నిర్వహించిన సదస్సులో డిడి ముర్తుజా ముఖ్యాతిధిగా హాజరై యువతనుద్దేశించి ప్రసంగించారు. పుస్తక పరిజ్ఞానంతో పాటు ప్రాపంచిక పరిజ్ఞానం పెంచుకోవాలని సూచించారు. ఇందుకోసం పత్రికలు చదవాలని అన్నారు. ప్రస్తుత పోటీ యుగంలో పోటీతత్వంతో ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛభారత్‌ వంటి సామాజిక కార్యక్రమాలలో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అబ్దుల్‌ కలాం అశయాల అడుగుజాడల్లో నడవాలని ఉద్బోదించారు. కలామిజాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం సంస్థ కషి చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తిరునగరి శ్రీహరి యువతకు ఉద్యోగావకాశాల నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం జిల్లా సమన్వయకర్త తక్కూరి హన్మాండ్లు, ప్రతినిధి చింతల గంగాదాస్‌, పిఎంకెకె వైస్‌ ప్రిన్సిపాల్‌ జి.రాజు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి ఒక్కరు అల‌ర్ట్‌

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నందున మరింత అప్రమత్తంగా ఉండాల‌ని ...

Comment on the article