Breaking News

Daily Archives: October 20, 2019

కార్మికుల సమ్మెకు తెలంగాణ ఐకెపి వివోఏ సంఘం మద్దతు

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో గత 16 రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తుండగా వారి సమ్మెకు తెలంగాణ ఐకెపి వివోఎ యూనియన్‌ కామారెడ్డి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలిపింది. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి తెలంగాణ ఐకెపి వివోఎల యూనియన్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పటాన్‌ గౌస్‌ ఖాన్‌, జిల్లా అధ్యక్షులు బాబా గౌడ్‌, సీఐటీయూ జిల్లా ...

Read More »

అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం ఆర్టీసీ బంద్‌ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను, కార్మిక సంఘాలను, ఉద్యోగ సంఘాలను, సామాజిక సంఘాలను ఉక్కుపాదంతో అణచివేతకు పోలీసు యంత్రాంగాన్ని ప్రయోగించి చేసిన అక్రమ అరెస్టులను నిరసిస్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని, రాజ్యాంగ హక్కుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె డిమాండ్లు పరిష్కరించాలని, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. పార్టీ జిల్లా ...

Read More »

సిఎం దిష్టిబొమ్మ దహనం

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌టిసి కార్మికుల సమస్యల పరిష్కరానికై శనివారం బంద్‌కు పిలుపునిచ్చిన వామపక్ష నేతలను అరెస్ట్‌ చేసి అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఆదివారం వామపక్షనేతలు సిఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా కొత్త బస్టాండ్‌ నుండి ర్యాలీగా వెళ్లిన వామపక్ష నాయకులపై అరెస్టులు, కేసులు చేయడం సిగ్గుచేటని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.బాలరాజు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్‌.దశరథ్‌, సిపిఎం జిల్లా నాయకులు ...

Read More »

పుట్ట ఎల్లమ్మకు పూజలు

నందిపేట్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలో ఆదివారం నుండి గౌడ సంఘం ఆధ్వర్యంలో పుట్ట ఎల్లమ్మ పూజలు నిర్వహిస్తున్నట్టు సంఘం అధ్యక్షులు చింతల కిష్టాగౌడ్‌ తెలిపారు. ఆదివారం మంగళ హారతులు, సోమవారం బోనాలతో ఊరేగింపుగా వెళ్ళి అమ్మవారికి సమర్పణలు చేసి మంగళవారం అమ్మవారికి కల్యాణం, నాగవల్లి కార్యక్రమాలు జరుపుతామన్నారు.

Read More »

మహిళా సర్పంచ్‌ను ఇబ్బందులు పెట్టడం న్యాయమా…?

నందిపేట్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా సర్పంచ్‌ అయినందున టిఆర్‌ఎస్‌ నాయకులు ఇబ్బందులు పెట్టడం న్యాయమా అని నందిపేట్‌ సర్పంచ్‌ ఎస్‌జి వాణి ప్రశ్నించారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నందిపేట టిఆర్‌ఎస్‌ నాయకులు శనివారం మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు పూర్తి అవాస్తవమని, ఉప సర్పంచ్‌ 60 లక్షల రూపాయల విలువ గల చెక్కులపై సంతకాలు పెట్టినట్లు చెప్పడం పూర్తి అవాస్తవమన్నారు. కేవలం 30 లక్షల విలువ గల చెక్కుల పైన మాత్రమే సంతకాలు ...

Read More »

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్‌

బాన్సువాడ, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో ”బాన్సువాడ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం” ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర శాసనసభ సభాపతి శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ జిల్లాలో 223 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పటికే 35 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. నియోజకవర్గ పరిధిలో గత ఏడాది 1.37 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా, ఈ ఏడాది ...

Read More »