Breaking News

సిఎం దిష్టిబొమ్మ దహనం

కామారెడ్డి, అక్టోబర్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌టిసి కార్మికుల సమస్యల పరిష్కరానికై శనివారం బంద్‌కు పిలుపునిచ్చిన వామపక్ష నేతలను అరెస్ట్‌ చేసి అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ ఆదివారం వామపక్షనేతలు సిఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా కొత్త బస్టాండ్‌ నుండి ర్యాలీగా వెళ్లిన వామపక్ష నాయకులపై అరెస్టులు, కేసులు చేయడం సిగ్గుచేటని సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.బాలరాజు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్‌.దశరథ్‌, సిపిఎం జిల్లా నాయకులు వెంకట్‌ గౌడ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు గణేష్‌, ఆర్‌ఎస్‌పి జిల్లా కార్యదర్శి కొత్త నర్సింలు అన్నారు.

శాంతి యుతంగా ర్యాలిగా వెళ్ళిన వారిని అరెస్టు చేయడం సిగ్గు చేటని, అదే విదంగా టిఎస్‌ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్‌ చేశారు. కనీసం చర్చలకు పిలువకపోవడం సిగ్గు చేటని వారన్నారు. అరెస్టును తీవ్రంగా ఖండించారు.

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కెసిఆర్‌ పాలన కొనసాగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం చర్చలకు పిలువక పోవడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్‌ చెప్పిన న్యాయమైన డిమాండ్లను కార్మికులు అడుగుతున్నారని, ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Check Also

ఆసరా పించన్‌ల పంపిణీ

నందిపేట్‌, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని తపాలా కార్యాలయానికి ఆసరా పింఛన్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *