Breaking News

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో సోమవారం పోలీసు అమర వీరులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు.

1959లో అమరులైన సీఆర్పీఎఫ్‌ పోలీసులను స్మరించుకుంటూ అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని నందిపేట్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌ అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది, వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రముఖులు పాల్గొన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Comment on the article