Breaking News

Daily Archives: October 22, 2019

రైతులు దళారులను ఆశ్రయించొద్దు

రెంజల్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేయవద్దని తహసిల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ అన్నారు. మండలంలోని దూపల్లి గ్రామంలో మంగళవారం ప్రాథమిక సహకరసంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని దళారులను ఆశ్రయించవద్దని అన్నారు. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని రైతులకు గిట్టుబాటును ...

Read More »

సమ్మెకు మద్దతుగా వామపక్షాల ర్యాలీ

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేపట్టి 18 రోజులు గడుస్తున్నా, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా లెఫ్ట్‌ పార్టీలైన సిపిఎం, సిపిఐ, ఆర్‌ఎస్‌పిల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మె చేపట్టి 18 రోజులు గడుస్తున్నా వారి సమస్యలు పరిష్కరించకుండా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, తమ తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన ...

Read More »

బస్‌డిపోను సందర్శించిన అధికారులు

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌. శ్వేత కామారెడ్డి బస్‌ డిపోను సందర్శించి బస్సుల రాకపోకలను, ఏర్పాట్లను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నోడల్‌ అధికారి, కామారెడ్డి ఆర్డిఓ రాజేంద్ర కుమార్‌ను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. బస్‌ డిపోలో, బస్టాండులో పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారి వెంట డిఎస్పి లక్ష్మీనారాయణ, ఆర్టిసి డివిజనల్‌ మేనేజర్‌ గణపతి, డిపో ...

Read More »

భాస్కర్‌రావు అంత్యక్రియలకు హాజరైన షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం ఉదయం కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు కైలా శ్రీనివాస్‌ తండ్రి కైలాస్‌ భాస్కర్‌ రావు స్వర్గస్తులైనారు. వీరి దహన సంస్కారంలో మాజీ శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ హాజరయ్యారు. భాస్కర్‌రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భాస్కర్‌రావు అంతిమయాత్రలో పాల్గొని, దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి కైలాస్‌ శ్రీనివాస్‌ను, వారి కుటుంబ ...

Read More »

మిషన్‌ భగీరథ పనులు వేగవంతం చేయండి

రెంజల్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మిషన్‌ భగీరథ ఎస్‌సి రాజేంద్ర కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన మిషన్‌ భగీరథ పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి కుటుంబానికి తాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన మిషన్‌ భగీరథ పథకాన్ని అలసత్వం లేకుండా పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ ప్రమోద్‌కు సూచించారు. కాంట్రాక్టర్లు పనులలో అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని అన్నారు. కాంట్రాక్టర్లు ఇష్టారీతిన పనులను ...

Read More »

నష్టపోయిన పంట పరిశీలన

కామారెడ్డి, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి పట్టణ పరిసర గ్రామాల రైతులు పండించిన పంట వరి ధాన్యం చేలు అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట నేలపాలు కావడాన్ని ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో ఎడ్లబండిపై తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం, జబ్బర్‌ నాయక్‌ మాట్లాడుతూ అకాలంగా కురిసిన వర్షాలకు చేతికొచ్చిన వరి చేను నేల పాలు కావడంతో రైతు చేసిన ఆరుగాలం కష్టం నేల పాలైందన్నారు. ప్రకృతి ...

Read More »

బ్యాంకు రుణాలతో ట్రాక్టర్ల కొనుగోలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను సమకూర్చుకోవడానికి బ్యాంకులు రుణాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం తన చాంబర్లో బ్యాంకు అధికారులు, పంచాయితీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా చెత్తను సేకరించడానికి, డంపింగ్‌ చేయడానికి, హరితహారం మొక్కలకు నీటిని అందించడానికి ఇతర కార్యక్రమాలకు ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని కలెక్టర్‌ ...

Read More »

పెరటి తోట

నందిపేట్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్యమే మహాభాగ్యం .. ఈ నినాదం కాస్తా నీరు గారిపోతుంది .విపరీత రసాయనాలతో పండిస్తున్న ఆహారోత్పత్తులు చిరుప్రాయంలోనే ప్రాణాంతక వ్యాధుల భారిన పడేస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపడానికి పలువురు సేంద్రియ పంటల సాగుచేస్తున్నారు. ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి ఇంటి అవసరాలు తీర్చుకోవడానికి మిద్దె సాగు, పెరటి సాగు చేస్తున్నారు. అలాంటి వారిలో ఒకరు నందిపేట గ్రామ వాసి షేక్‌ జవీద్‌. వ్యాపారం చూసుకునే ఆయనకు మూడేళ్ళ కిందట వచ్చిన ఆలోచనను ...

Read More »

అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు నిండుకోవడంతో పర్యటించడానికి ప్రజలు ఉత్సాహం చూపుతారని నీటిలోని కూడా వెళ్లడానికి ప్రయత్నం చేస్తారని తద్వారా ప్రమాదాలకు అవకాశం ఉంటుందని అప్రమత్తంగా ఉండడం ద్వారానే ప్రమాదాలు నివారించడానికి వీలవుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో వెంట ఉండి జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. గేట్లు ...

Read More »