Breaking News

నష్టపోయిన పంట పరిశీలన

కామారెడ్డి, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డి పట్టణ పరిసర గ్రామాల రైతులు పండించిన పంట వరి ధాన్యం చేలు అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట నేలపాలు కావడాన్ని ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో ఎడ్లబండిపై తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం, జబ్బర్‌ నాయక్‌ మాట్లాడుతూ అకాలంగా కురిసిన వర్షాలకు చేతికొచ్చిన వరి చేను నేల పాలు కావడంతో రైతు చేసిన ఆరుగాలం కష్టం నేల పాలైందన్నారు.

ప్రకృతి విపత్తుల మూలంగ నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు స్వామినాథన్‌ సిఫార్సు ప్రకారం పెట్టుబడి ఎకరానికి 25 వేల రూపాయలు 2015లో నిర్ణయించారని నేడు పెట్టుబడి ఎకరానికి 35 వేలకు చేరిందన్నారు. ఈ పెట్టుబడి కోసం రైతులు ఆత్మహత్యల పాలు కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డివిజన్‌ వ్యాప్తంగా పంట నష్టపోయిన వారి వివరాలు సేకరించి ఎకరానికి 35 వేల నష్టపరిహారాన్ని అందించి రైతులని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

లేనిపక్షంలో రైతుల పక్షాన ఎంసిపిఐ పార్టీ రైతులకు న్యాయం కోసం ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సిహెచ్‌ తిరుపతి, రమేష్‌, కిషన్‌ నాయక్‌, మద్దెల రాజు, ప్రభాకర్‌ రైతులు పాల్గొన్నారు.

Check Also

బీజేపీ మండల అధ్యక్షుడుగా చుక్క రాజు

రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా క్యాంపులో బుధవారం జరిగిన బీజేపీ మండలస్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *