Breaking News

అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండి నందున ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రమాదాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు నిండుకోవడంతో పర్యటించడానికి ప్రజలు ఉత్సాహం చూపుతారని నీటిలోని కూడా వెళ్లడానికి ప్రయత్నం చేస్తారని తద్వారా ప్రమాదాలకు అవకాశం ఉంటుందని అప్రమత్తంగా ఉండడం ద్వారానే ప్రమాదాలు నివారించడానికి వీలవుతుందని ఆయన తెలిపారు.

ముఖ్యంగా తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో వెంట ఉండి జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. గేట్లు వదిలినప్పుడు పారే నీటిలో సాహసాలకు వెళ్లవద్దని ఆయన యువతకు సూచించారు. రెవెన్యూ నీటిపారుదల అధికారులు పోలీసు యంత్రాంగం నదీ పరివాహక ప్రాంతంలో, ప్రాజెక్టు చుట్టుపక్కల జాగ్రత్తగా విధులు కేటాయించుకుని నిర్వహించాలని ప్రాజెక్టు ప్రమాదం అంచులకు వెళ్లకుండా నివారించాలని ఆయన తెలిపారు.

Check Also

బీజేపీ మండల అధ్యక్షుడుగా చుక్క రాజు

రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా క్యాంపులో బుధవారం జరిగిన బీజేపీ మండలస్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *