Breaking News

బస్‌డిపోను సందర్శించిన అధికారులు

కామారెడ్డి, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ, జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌. శ్వేత కామారెడ్డి బస్‌ డిపోను సందర్శించి బస్సుల రాకపోకలను, ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రజలకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నోడల్‌ అధికారి, కామారెడ్డి ఆర్డిఓ రాజేంద్ర కుమార్‌ను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. బస్‌ డిపోలో, బస్టాండులో పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారి వెంట డిఎస్పి లక్ష్మీనారాయణ, ఆర్టిసి డివిజనల్‌ మేనేజర్‌ గణపతి, డిపో మేనేజర్‌ ఆంజనేయులు ఉన్నారు.

Check Also

అర్హత గల రైతుల‌కు పంట రుణాలు

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు కల్లాల‌ నిర్మాణం పనుల‌ను త్వరిత గతిన పూర్తి ...

Comment on the article