Breaking News

మిషన్‌ భగీరథ పనులు వేగవంతం చేయండి

రెంజల్‌, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మిషన్‌ భగీరథ ఎస్‌సి రాజేంద్ర కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆయన మిషన్‌ భగీరథ పనులను పరిశీలించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి కుటుంబానికి తాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన మిషన్‌ భగీరథ పథకాన్ని అలసత్వం లేకుండా పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఏఈ ప్రమోద్‌కు సూచించారు. కాంట్రాక్టర్లు పనులలో అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని అన్నారు. కాంట్రాక్టర్లు ఇష్టారీతిన పనులను పెండింగ్‌లో ఉంచితే ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని హెచ్చరించారు.

పెండింగ్‌లో ఉన్న ప్రతి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఈ మున్ని నాయక్‌, ఏఈ ప్రమోద్‌, పంచాయతీ కార్యదర్శి యాదగిరి తదితరులు ఉన్నారు.

Check Also

నిజామాబాద్‌ వాసి సౌదీలో కరోనాతో మృతి

మాజీ ఎంపి కవిత సహకారంతో అంత్యక్రియలు పూర్తి నిజామాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శరీర ...

Comment on the article