Breaking News

Daily Archives: October 24, 2019

16వ సారి రక్తదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ లింగాపూర్‌కు చెందిన అవుసుల బ్రహ్మంకు ప్లేట్లెట్స్‌ తగ్గిపోయి జయ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. బి పాజిటివ్‌ రక్తం అవసరం కాగా కామారెడ్డి ఎబివిపి పూర్వ కార్యకర్తల రక్త దాతల సమూహాన్ని సంప్రదించారు. టిజివిపి రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల నవీన్‌ రక్తదానం చేయడం జరిగింది. అనంతరం నవీన్‌ మాట్లాడుతూ టిజివిపి విద్యార్థి సమస్యల పరిష్కారం కోసమే కాకుండా ఇలాంటి రక్తదాన సేవా కార్యక్రమాలలో కూడా ముందుంటుందన్నారు. కార్యక్రమంలో అశోక్‌ నగర్‌ కాలనీ ...

Read More »

జిల్లా కలెక్టర్‌కు బంగారు పతకం

కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ తెలంగాణ రాష్ట్ర వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ రాజ్‌భవన్‌ సంస్కృతి హాల్‌లో గురువారం రాష్ట్ర గవర్నర్‌ తమిళసై సౌందర్‌ రాజన్‌ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ బంగారు పతకాన్ని అందుకున్నారు. రెడ్‌క్రాస్‌ నూతన సభ్యత్వం, రక్తదాన ప్రోత్సాహం, వివిధ రంగాల్లో చూపిన ప్రతిభకు గాను జిల్లా కలెక్టర్‌ గోల్డ్‌ మెడల్‌తోపాటు ప్రశంసా పత్రం అందుకున్నారు. నూతనంగా ఏర్పడిన జిల్లాల్లో కామారెడ్డి జిల్లా రక్తదానంలో ప్రథమ స్తానంలో ఉండడం పట్ల ...

Read More »

భారీ వర్షంతో జలమయమైన కామారెడ్డి వీధులు

కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గురువారం కురిసిన భారీ వర్షం కారణంగా పట్టణంలోని రోడ్లన్ని జలమయమయ్యాయి. కామారెడ్డిలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో మురికి నీరు, వర్షం నీరు రోడ్లపైకి చేరి మోకాళ్లలోతు నీరు రోడ్లపై నిలిచింది. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. పాదచారులు, ద్విచక్ర వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలుతుండగా మురికి నీరంతా ఇళ్లపక్కకు వచ్చి చేరడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. మురికి కాలువలను శుభ్రపరిచి సరైన డ్రైనేజీ ...

Read More »

కురిసిన వర్షం – తడిసిన ధాన్యం

కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గురువారం కురిసిన భారీ వర్షం కారణంగా రైతులు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది. మక్కలు వ్యవసాయ మార్కెట్‌ ప్రాంగణంలో రైతులు ఆరబోయగా ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో వర్షానికి మక్కలు కొట్టుకుపోయాయి. దీంతో రైతులు లబోదిబోమన్నారు. కష్టపడి పంట పండించి ఇలా అమ్ముకుందామని మార్కెట్‌కు తెస్తే వర్షం కారణంగా మక్కలు కొట్టుకుపోగా ఉన్నవి సైతం తడిసి ముద్దయ్యాయని, ఇపుడు తమ పరిస్థితి ఏంటని నిట్టూర్చారు. మక్కలో తేమ ఉంటే ...

Read More »

భారీ వర్షం- నేలకొరిగిన పంటలు

కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గురువారం కురిసిన భారీ వర్షానికి చేతికొచ్చిన వరి పంట నేలకొరిగింది. ఆరుగాలం కష్టించిన రైతుకు అకాల వర్షాల వల్ల చేదు అనుభవం మిగిలింది. వరి పంట కోతకొచ్చే సమయంలో నేలకొరగడంతో రైతులు లబోదిబో మంటున్నారు. ఎంచేయాలో పాలుపోని పరిస్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. ఇలాగే మరికొన్ని వానలు కురిస్తే పంట పూర్తిస్థాయిలో దెబ్బతినేలా ఉందని రైతులు నిట్టూరుస్తున్నారు.

Read More »

రైతులు, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

కామారెడ్డి, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు, పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశాన్ని జడ్పి ఛైర్మన్‌ దఫేదార్‌శోభ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై మంత్రి మాట్లాడారు. రైతులు, పేదలు లాభ పడేవిధంగా వారికి సంక్షేమ ఫలాలు అందేవిధంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. పలు సంక్షేమ పథకాలు, పనులపై జడ్పిటిసిలు, ఎంపిటిసిలు ...

Read More »

టిఆర్‌ఎస్‌ గెలుపు ప్రతిపక్షాలకు చెంపపట్టు

రెంజల్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 21 న జరిగిన హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడడంతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఉత్తమ్‌ పద్మావతిపై 43,284 వేల భారీ మెజార్టీతో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపొందడం ప్రతిపక్షాలకు చెంపపెట్టులాంటిదని మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌, సర్పంచ్‌ రమేష్‌ కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద టిఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా సంబరాలు నిర్వహించారు. బాణసంచాలు కాలుస్తూ మిఠాయిలు పంచి ఒకరినొకరు తినిపించుకున్నారు. ఈ ...

Read More »

నిబంధనలు పాటించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మద్యం షాపుల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించే విధంగా శాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జిల్లాలో ఇంకా 8 మిగిలిపోయిన మద్యం షాపులు లక్కీ డ్రా ప్రగతి భవన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతనంగా మద్యం షాపులను పొందినవారు సమయపాలన నియమ నిబంధనలు పాటించాలని చెప్పారు. ఈ విషయంలో అధికారులు యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం నూతన మద్యం ...

Read More »

గోడప్రతుల ఆవిష్కరణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఖరీఫ్‌ వరి పంటకు కనీస మద్దతు ధర రైతులకు అవగాహన కల్పించే గోడ పత్రికలు జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు గురువారం ఉదయం చాంబర్‌లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతో కలిసి విడుదల చేశారు. జిల్లాలో దాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుచేసిన రైతులు పూర్తి అవగాహన పెంచేందుకు గోడ పత్రికలు అన్నిచోట్ల ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఈ సందర్భంగా ...

Read More »

అకాల వర్షాలతో నీటమునిగిన పంటలు

రెంజల్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో కోతకొచ్చిన వరి పంటలు నీట మునిగి నేలకొరిగి పోయాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు కోతకు వచ్చే దశలో వర్షంతో తీవ్ర నష్టం వాటిల్లడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు అప్పు చేసి పండించిన పంటలు కోతకు వచ్చే దశలో అకాల వర్షాలతో నీటమునగడంతో చేసిన అప్పులు తీర్చుకోలేని స్థితిలో రైతులున్నారు. వందలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగి పోవడంతో ...

Read More »

బ్యాంకు సేవలు సామాన్యులకు చేరాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బ్యాంకు సేవలు సామాన్య ప్రజలకు చేరేందుకు కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు గురువారం బస్వా గార్డెన్‌లో గురు, శుక్రవారాల్లో రెండు రోజులపాటుజరిగే ఖాతాదారుల సేవ మహోత్సవం కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో అవసరమున్నవారే బ్యాంకుల వద్దకు వెళ్లేవారని, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వలన గతంలో వెళ్లలేని ప్రాంతాలకు సేవలందిస్తున్నారు. టెక్నాలజీ పరంగా ...

Read More »

పోస్టర్ల ఆవిష్కరణ

ఆర్మూర్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో కుమార్‌ నారాయణ భవన్‌ వద్ద న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు బొటనవేలు తెగ్గొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, కెసిఆర్‌ నిరంకుశ పాలన నశించాలని ముద్రించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ ఆర్మూర్‌ డివిజన్‌ కార్యదర్శి ప్రభాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్‌ని అరెస్టు చేసి ఖమ్మంకు తరలించినప్పుడు ఖమ్మంలో కెసిఆర్‌కి అండదండగా ఉద్యమానికి మద్దతుగా పోరాడిన పోటు రంగారావుకు ...

Read More »