Breaking News

Daily Archives: October 28, 2019

కుటుంబ కలహాలతో యువకుని ఆత్మహత్య

కామారెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం రాత్రి గర్గుల్‌ గ్రామానికి చెందిన మన్నె వినయ్‌ కుమార్‌ (18) ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో దూలానికి ఉరి వేసుకొని చనిపోయాడని పోలీసులు తెలిపారు. గత కొంతకాలంగా కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయని, దీంతో మనస్తాపానికి గురైన వినయ్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. తల్లి మాధవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Read More »

ప్రభుత్వం కుట్ర పూరితంగా ఆలోచిస్తుంది

కామారెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌టిసి కార్మికులకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కునంనేనీ సాంబశివరావును అర్ధరాత్రి 1:30 గంటలకు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూన్నామని సిపిఐ, ఏఐటియుసి, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ నాయకులు అన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లాలోని స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి పి.బాలరాజు మాట్లాడారు. ఆర్‌టిసి కార్మికులకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కునం నేనీ సాంబశివరాంని అర్ధ రాత్రి 1:30 గంటలకు పోలీసులు ...

Read More »

రెండు నెలలలో పూర్తి చేస్తాం

ఆర్మూర్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంచగుడి నుండి నందిపేట్‌ వరకు వయా సిహెచ్‌ కొండూరు రోడ్డు నిర్మాణ విషయం ఆర్మూర్‌ శాసనసభ్యుడు జీవన్‌ రెడ్డిని నిజామాబాద్‌ న్యూస్‌ సంప్రదించింది. అధికారులతో మాట్లాడి రెండు నెలల లోపు పూర్తి చేస్తామన్నారు. వర్షాల మూలంగా పనులు నిలిచిపోయాయని, అధికారులతో సంప్రదించి రోడ్డును త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

Read More »

విద్యుత్‌ షాక్‌తో వ్యక్తి మతి

రెంజల్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామానికి చెందిన వెల్మల సాయిలు (30) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ తగిలి మతి చెందినట్లు రెంజల్‌ ఎస్సై శంకర్‌ తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. తాడ్‌బిలోలి గ్రామంలో బార్బర్‌ షాపు నిర్వహిస్తున్న వెల్మల సాయిలు ఆదివారం దీపావళి పండుగ సందర్భంగా బార్బర్‌ షాపులో పూజలు నిర్వహించి షాపు మూసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌ కు గురై అక్కడికక్కడే పడిపోయాడు. హుటాహుటిన భార్య, అతని తల్లి ...

Read More »

రోడ్డు నిర్మాణం చేపట్టండి

నందిపేట్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం నుండి నిర్మల్‌ జిల్లా పంచగుడి గ్రామాలను కలుపుతూ వేసిన గోదావరిపై వంతెన పూర్తి అయింది. కానీ ఉమ్మెడ పుష్కరఘాట్‌ వద్ద నిర్మించిన వంతెన నుండి ఉమ్మెడ గ్రామానికి వెళ్ళడానికి చెరువు కట్టపై నుండి తాత్కాలిక రోడ్డు ఉంది, కానీ చెరువు నిండి అలుగు పారుతుంది. దాంతో అటు వైపుగా వాహనాలు వెళ్లడం లేదు. ఇటు సిహెచ్‌ కొండూరు పాత మట్టి రోడ్డు ఒక్కటే శరణ్యం. వంతెన నిర్మాణం ...

Read More »

టిఆర్‌ఎస్‌ పాలన చెవిటిది, మూగది, గుడ్డిది

కామారెడ్డి, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ పాలన చెవిటి, మూగ, గుడ్డిది లాగా మారిందని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జన సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి కుంభాల లక్ష్మణ్‌ విమర్శించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లనే ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని, కేసీఆర్‌ నియంతత్వ వైఖరి వల్లనే రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు లేక పోవడం ...

Read More »

చెత్త డబ్బాల్లోనే వేయాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌ మండలంలోని దొనకల్‌ గ్రామంలో చెత్తపై అవగాహన కల్పించారు. గ్రామస్తులు చెత్తను నిజాంసాగర్‌ కెనాల్‌లో వేయవద్దని సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక సర్పంచ్‌ కత్తి లావణ్య, ఉప సర్పంచ్‌ పాశపు మల్లేష్‌, ఎంపిటిసి దేవతి అశోక్‌, కార్యదర్శి ఎంఏ ఖాన్‌ ఉన్నారు. ఇంటింటికి వీధి వీధికి చెత్త డబ్బాలు ఏర్పాటు చేశామని చెత్త డబ్బాలలో చెత్తను వేయాలని, వేసిన చెత్తను గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్‌తో ...

Read More »

ఆర్డీవోకు వినతి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో ఆర్టీసీ కార్మికుల ఐకాస ఆధ్వర్యంలో బస్టాండ్‌ నుండి అంబేద్కర్‌ చౌక్‌ మీదుగా పాత బస్టాండ్‌ ద్వారా స్థానిక తాసిల్దార్‌ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆర్‌డిఓకు వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీ సమ్మె పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరంకుశ మొండి వైఖరి విడనాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఐకాస కన్వీనర్‌ చిలక రవి, నరసింహులు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ...

Read More »

చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోవడం వల్లే అనర్థాలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో సంబంధిత అధికారులు బాధ్యత వహించవలసి ఉంటుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు హెచ్చరించారు. సోమవారం ప్రగతి భవన్‌లో అధికారులనుద్దేశించి మాట్లాడారు. చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోవడం, మాకేమి సంబంధం లేనట్టు అజాగ్రత్తగా, వ్యతిరేక భావంతో ప్రవర్తించడం వలన ఇటీవల శుక్రవారం జరిగిన సంఘటన విద్యార్థి విలువైన ప్రాణం పోయిందని, ఇలాంటి సంఘటనలు పునరావతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ ...

Read More »

ప్రతి ఒక్కరూ పారిశుద్యంపై శ్రద్దవహించాలి

రెంజల్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే సీజనల్‌ వ్యాధులు దోమల నుండి వచ్చే విష జ్వరాలు ప్రబలకుండా ఉంటుందని, ప్రతిరోజు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. మండలంలోని కందకుర్తి గ్రామాన్ని సోమవారం ఆయన సందర్శించారు. 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక ప్రణాళికలో చేపట్టిన పనులను ఆయన పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా చెత్తాచెదారం మురికి కాలువలు అపరిశుభ్రంగా ఉండటంతో పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 30 రోజుల ...

Read More »

పేకాట రాయుళ్ళ అరెస్ట్‌

నందిపేట్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దీపావళి సందర్భంగా పేకాట ఆడిన 52 మందిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ రాఘవేంద్ర తెలిపారు. పేకాట నిషేధ చట్టాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా పేకాట ఆడవద్దని పోలీసులు ఇదివరకే ప్రకటించారని అన్నారు. అయినా పట్టించుకోకుండా పేకాటరాయుళ్లు దీపావళి సందర్భంగా విచ్చలవిడిగా గల్లీలలో పేకాట ఆడినట్లు తెలిసిందన్నారు. పక్కా సమాచారం మేరకు పేకాట ఆడే స్థావరాలలో దాడిచేసి ఆదివారం రాత్రి 52 మందిని అరెస్టు చేసి వారి ...

Read More »

పరివాహక ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోదావరి నీటి ఉదృతి వలన పరివాహక ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. త్రివేణి సంగమంగా పేరుగాంచిన రెంజల్‌ మండలం కందకుర్తి గ్రామం వద్ద గోదావరిలోకి వస్తున్న ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్‌ శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు ప్రాజెక్టు నుండి విడుదల చేసిన నీటి ప్రవాహన్ని తెలుసుకొని జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ...

Read More »