Breaking News

చెత్త డబ్బాల్లోనే వేయాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్‌ మండలంలోని దొనకల్‌ గ్రామంలో చెత్తపై అవగాహన కల్పించారు. గ్రామస్తులు చెత్తను నిజాంసాగర్‌ కెనాల్‌లో వేయవద్దని సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

స్థానిక సర్పంచ్‌ కత్తి లావణ్య, ఉప సర్పంచ్‌ పాశపు మల్లేష్‌, ఎంపిటిసి దేవతి అశోక్‌, కార్యదర్శి ఎంఏ ఖాన్‌ ఉన్నారు. ఇంటింటికి వీధి వీధికి చెత్త డబ్బాలు ఏర్పాటు చేశామని చెత్త డబ్బాలలో చెత్తను వేయాలని, వేసిన చెత్తను గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్‌తో వచ్చి డంపింగ్‌యార్డుకు తరలిస్తారని సూచించారు.

నిజాంసాగర్‌ కెనాల్‌లో పారేసిన చెత్త చెదారాన్ని ట్రాక్టర్‌తో చదును చేయించి శుభ్రపరిచారు. ఇంకోసారి ఎవరైనా నిజాంసాగర్‌ కెనాల్‌లో చెత్తాచెదారాన్ని పార వేస్తే జరిమానా విధిస్తామన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, జిపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

తెలంగాణ విద్వత్సభ నిర్ణయించిన పండగల వివరాలు

The following two tabs change content below.BioLatest Posts Nizamabad News Latest posts by Nizamabad News ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *