ఆర్మూర్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడి అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర రెండవ మహాసభలు నవంబర్ 3, 4 తేదీలలో నిజామాబాద్ పట్టణంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్టు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్ మాట్లాడారు. నవంబర్ 3, 4 తేదీలలో నిజామాబాద్ నగరంలో రాష్ట్ర మహా సభలు జరుగుతాయని, మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది డెలిగేట్స్ హాజరవుతారని అన్నారు. ప్రధానంగా ...
Read More »Daily Archives: October 31, 2019
ఉక్కు మనిషి సర్దార్ పటేల్
కామారెడ్డి, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్ధార్ వల్లభయ్ పటేల్ విగ్రహానికి పులా మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణా రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో అసమాన త్యాగాలు చేసిన సమర యోధుడు.. హైదరాబాద్ సంస్థానం ప్రజలకు నిజాం, రజాకార్ల పీడ నుంచి విముక్తి కలిగించిన ధీరుడు.. పటేల్ అన్నారు. 560కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం ...
Read More »వ్యాధి బాధ భరించలేక ఆత్మహత్య
కామారెడ్డి, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టేక్రియాల్ గ్రామానికి చెందిన సుంకరి నరసింహులు (45) గత రెండేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బాధను భరించుకోలేక బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఉరివేసుకొని ఆతహత్య చేసుకున్నాడు. మృతుని కుమారుడు సుంకరి నరేందర్ దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
Read More »విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వైబ్రంట్స్ ఆఫ్ కలామ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం బాల్కొండలో ‘జాతీయ సమైక్యత దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను నైపుణ్యాభివద్ధికై వైబ్రంట్స్ ఆఫ్ కలామ్ సంస్థ దత్తత తీసుకుంది. కార్యక్రమానికి జిల్లా ఇంటర్ మీడియేట్ విద్యాధికారి ఒడ్డెన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలను జిల్లా లో అన్ని కళాశాలల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ...
Read More »బీర్కూర్‌లో రాష్ట్రీయ ఎక్తా దివస్
బీర్కూర్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం బీర్కూర్ గ్రామపంచాయతీలో జాతీయ ఐక్యత దినోత్సవం రాష్ట్రీయ ఏక్తా దివాస్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార శాఖ భారత ప్రభుత్వం వారిచే నిజామాబాద్ ఫీల్డ్ పబ్లిసిట్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారిచే కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. కార్యక్రమంలో తెరాస పార్టీ ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఐకేపీ ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు, కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు, ప్రజలు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్వాడి టీచర్లు, సూపర్ వైజర్, పోషన్ ...
Read More »రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
బాన్సువాడ, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం హాన్మాజిపెట్లో అకాల వర్షాలతో నష్టపోయిన మొక్కజొన్న, వరి పంటలను స్థానిక నాయకులతో కలిసి బాన్సువాడ ఎంపిపి దొడ్ల నీరజ వెంకట్ రాం రెడ్డి పరిశీలించారు. వారి వెంట జెడ్పీటిసి పద్మ గోపాల్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని రైతులెవరు అధైర్యపడవద్దని ఎంపిపి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయసమితి అధ్యక్షులు అంజిరెడ్డి, మండల రైతు సమన్వయసమితి అధ్యక్షులు సంగ్రామ్ నాయక్, సర్పంచ్ సుభాష్, ఎంపీటీసీ ...
Read More »అవినీతికి పాల్పడితే ఉక్కుపాదం
నిజామాబాద్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెవెన్యూ రికార్డులు శుద్ధీకరణలో అవినీతికి అక్రమాలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు హెచ్చరించారు. రైతులను ఇబ్బందికి గురి చేస్తే సహించేది లేదన్నారు. రికార్డు పెండింగ్ పెట్టవద్దని 100 శాతం రికార్డులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. గురువారం ప్రగతి భవన్లో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిజామాబాద్ డివిజన్ రెవెన్యూ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్‌తో ...
Read More »బిజెపి జిల్లా అధికార ప్రతినిధిగా మారంపల్లి గంగాధర్
నందిపేట్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెపి జిల్లా అధికార ప్రతినిధిగా మారంపల్లి గంగాధర్ నియమితులయ్యారు. గంగాధర్ నందిపేట మండలం మారంపల్లి గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ. కాగా గురువారం బిజెపి జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి బిజెపి జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ప్రజా సేవలో ముందుంటానని అన్నారు.
Read More »వరి ఆరబెట్టడంలో ఆదర్శం… నందిపేట రైతులు
నందిపేట్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల రైతులు వరిపంటను తమ పొలాల్లో కోసిన తర్వాత తేమను తొలగించడానికి ఆరబెట్టడంలో ఇతర గ్రామాల రైతులకు ఆదర్శంగా వుంటున్నారు. ఇతర గ్రామాల రైతులలాగా రోడ్లపై గాకుండా ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని ఖుదాన్పూర్ గ్రామం నుండి ఆర్మూర్ వరకు గల గ్రామాల రైతులు తమ పంట పొలాల్లోని వరిని రోడ్లపై ఆరబెట్టడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిదంగా జోజిపేట్ నుండి నిజామాబాద్ వరకు ...
Read More »సర్దార్ పటేల్ మార్గంలో నడవడమే అసలైన నివాళి
నిజామాబాద్, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ ఆశయాల కోసం జీవించారో వాటి సాధనకు మనం కషి చేయడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అవుతుందని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. సర్దార్ పటేల్ 144వ జయంతిని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం, నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురితో కలిసి ...
Read More »