Breaking News

Daily Archives: November 1, 2019

సమాజసేవ చేసే ఆలోచన కొందరికే ఉంటుంది

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మై విలేజ్‌ మోడల్‌ విలేజ్‌ ఫౌండర్‌ జెర్సీ పాల ఉత్పత్తుల డైరెక్టర్‌ బాల్‌ రాజ్‌ గౌడ్‌ మతికి కామారెడ్డి జిల్లా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ సమాజ సేవ చేసే ఆలోచన బాల్‌ రాజ్‌ గౌడ్‌ లాంటి వ్యక్తులు కొందరికే మాత్రమే ఉంటుందని, సామాజిక సేవ చేయడంలో ఆయన పాత్ర ఎనలేనిదని కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్తుల స్వాధీన ఉద్యమంలో ...

Read More »

యువత బిజెపి వైపు చూస్తుంది

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణానికి చెందిన కాంగ్రెస్‌, తెరాస పార్టీల నాయకులు, 30 మంది యువకులు భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కామారెడ్డిలో కాషాయ జండా ఎగర వేయటమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని అన్నారు. కామారెడ్డి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని యువత మొత్తం బిజెపి వైపు ...

Read More »

సిద్ది వినాయక ఆలయంలో ఎంపి పూజలు

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ ఎంపీ బి.బి.పాటిల్‌ 64వ జన్మదినం సందర్బంగా రేజింతల్‌లోని శ్రీ సిద్ధివినాయక దేవాలయంలో, ఝారసంగంలోని శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపి వెంట పలువురు తెరాస నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Read More »

నిందితులను అరెస్ట్‌ చేయాలి

రెంజల్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడురోజుల కిందట సాటాపూర్‌ గ్రామానికి చెందిన జాదవ్‌ రవిని అదే గ్రామానికి చెందిన వ్యక్తులు కులం పేరుతో దూషించి దాడి చేసిన నిందితులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి మూడురోజులు గడుస్తున్నా పోలీసులు అరెస్టు చేయకపోవడం ఏంటని బాధితుడు జాదవ్‌ రవి నాయకులు నితిన్‌ అన్నారు. మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేయకపోవడంతో ...

Read More »

పురపాలక సమస్యలపై పాదయాత్ర

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో కామారెడ్డి పురపాలక సమస్యలపై పాదయాత్ర నిర్వహిస్తున్నట్టు పార్టీ ప్రతినిధులు తెలిపారు. నవంబర్‌ 2వ తేదీ శనివారం నుండి 10వ తేదీ వరకు జరిగే పాదయాత్రకు కార్యకర్తలు హాజరుకావాలని అన్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు యాత్ర ప్రారంభమవుతుందన్నారు. 2న కాకతీయనగర్‌ మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకు, కాలేజ్‌ గ్రౌండ్‌ వెనక పాదయాత్ర ఉంటుందన్నారు. కాకతీయనగర్‌ ఎన్‌జివోస్‌ కాలనీ, విద్యానగర్‌, కొత్త సాయిబాబా ఆలయం, విద్యుత్‌నగర్‌, దేవునిపల్లి, దేవునిపల్లి ...

Read More »

నేడు మండలానికి ఎమ్మెల్యే రాక

రెంజల్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షానికి నష్టపోయిన వరి పంటలను పరిశీలించేందుకు రెంజల్‌ మండలానికి బోధన్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్‌ వస్తున్నట్లు మండల అధ్యక్షుడు భూమరెడ్డి, రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యుడు మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు. అధికారులు, రైతులు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందుబాటులో ఉండాలన్నారు.

Read More »

తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలి

కామారెడ్డి, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుండాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం జనహిత సమావేశ మందిరంలో జిల్లా వైద్య శాఖ ద్వారా అందిస్తున్న తల్లీబిడ్డల వైద్య సేవల పట్ల జరిగిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. తల్లి బిడ్డ ఆరోగ్యం ముఖ్యమని, వారికి వైద్య సేవలు అందించడంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ...

Read More »

మురళిని పరామర్శించిన ఎమ్మెల్యే

నందిపేట్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం షాపూర్‌ ఎంపిటిసి భర్త మద్దుల మురళి యొక్క అన్న ఇటీవల ఆర్మూర్‌ లో ప్రమాదవశాత్తు మరణించాడు. శుక్రవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నందిపేట్‌ పర్యటనలో భాగంగా తొండకూర్‌లోని మురళి ఇంటికి వెళ్లి పరామర్శ చేశారు. అదేవిధంగా మతికి గల కారణాలు అడిగి తెలుసుకొన్నారు. కేసు వివరాలు తీసుకొని తగు న్యాయం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నక్కల భూమేష్‌, ఎంపిపి వకిడి సంతోష్‌, డొంకేశ్వర్‌ ఎంపిటిసి బైండ్ల ...

Read More »

హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వినియోగదారుల హక్కుల పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ అధ్యక్షులు జస్టిస్‌ ఎంఎస్‌కె జైస్వాల్‌ అన్నారు. శుక్రవారం సాయంత్రం జెడ్‌పి ప్రాంగణంలో (పాముల బస్తీ) గల జిల్లా వినియోగదారుల ఫోరం భవనాన్ని జస్టిస్‌ జైస్వాల్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు వినియోగదారుల వారి హక్కులను కాపాడుకునేందుకు కషి చేయాలి. వినియోగదారుల కోర్టులో అడ్వకేట్‌ అవసరం లేకుండా స్వతహాగా కేసు వేసుకోవచ్చునని సివిల్‌ కోర్ట్‌ ...

Read More »

కస్తూర్బా పాఠశాల తనిఖీ

బాన్సువాడ, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం కెజివిపి కొత్తబాధి పాఠశాలను ఎంపిపి దొడ్ల నీరజ వెంకట్‌ రాం రెడ్డి పరిశీలించారు. మధ్యాహ్నం కెజివిపి పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేయగా పప్పులో పురుగులు ఉండడంతో ప్రిన్సిపాల్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. స్టాక్‌ రిజిస్టర్‌ మూడు నెలల నుండి నిర్వహించడం లేదని, సరకులు నాసిరకంగా పురుగులు పట్టి ఉన్నాయని గమనించారు. విషయం డిఈఓకు ఫోన్‌లో వివరించారు. ఆమె వెంట తిర్మలాపూర్‌ సర్పంచ్‌ రఘు, మల్లారెడ్డి, సాయిలు, ఎంఈ ఓ తదితరులు ఉన్నారు.

Read More »

వరుణుడి కోపానికి ముద్దయిన ధాన్యం

నందిపేట్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలో ఈయేడు పంటలు బాగా పండి ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయని అనుకున్న రైతులకు, వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. కాలం పూర్తవుతున్నా అడపా దడపా వానలు పడుతూనే ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన వరి కోతలు కోసం తంటాలు పడుతున్న రైతులకు ధాన్యాన్ని కోసిన తర్వాత మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు అవకాశం దొరకకపోగా, వరి ధాన్యం మరింత తడిసి ...

Read More »