జిల్లా కేంద్రంలో కాల్‌సెంటర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆసరా పెన్షన్‌ లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన కాల్‌ సెంటర్‌ అవగాహన కల్పించేందుకు సంబంధించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆసరా పెన్షన్‌ లబ్ధిదారులు జిల్లా కేంద్రానికి రాకుండానే కాల్‌ సెంటర్‌కు ఫిర్యాదు చేస్తే స్వీకరించి పరిష్కారం చేస్తారని చెప్పారు.

కాల్‌ సెంటర్‌లో లబ్ధిదారులు ఫోన్‌ చేసిన పక్షంలో వెంటనే వినతిని నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత సంబంధిత మండల జిల్లా అధికారులకు ఆన్‌లైన్‌ ద్వారా సమాచారం అందిస్తారని, వచ్చిన వినతిపై సంబంధిత సిబ్బంది విచారణ చేసి ఆన్‌లైన్‌ ద్వారానే వినతి పరిష్కారం తెలియజేస్తారని చెప్పారు. ఇందుకోసం జిల్లా సమైక్యలో ఏర్పాటుచేసిన కాల్‌ సెంటర్‌ నంబర్‌ 70328 12777 ద్వారా వినతులను తెలియజేయ వచ్చునని అన్నారు.

ఆసరా పెన్షన్‌ లబ్దిదారులు తమ సమస్యలను మండల జిల్లా కార్యాలయాలకు వెళ్ళకుండానే ఏర్పాటు చేసిన నంబర్‌కు జిల్లా సమాఖ్య కాల్‌ సెంటర్‌ ద్వారా ఉచితంగా పరిష్కారం పొందవచ్చునని కలెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, డిఅర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌, నిజామాబాద్‌ ఆర్డీవో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *