రైతులు దళారులను ఆశ్రయించవద్దు

రెంజల్‌, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు పండించిన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు లోలపు రజినీ అన్నారు.

సోమవారం మండలంలోని దండిగుట్ట గ్రామంలో జడ్పీటీసీ మేక విజయ, సర్పంచ్‌ శ్రీదేవితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులు కష్టపడి ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అన్నారు.

ప్రభుత్వం రైతుల గిట్టుబాటు ధరను కల్పిస్తుందని ప్రభుత్వ మద్దతు ధర ‘ఏ’ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1835 రూపాయలు, ‘బి’ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1815 రూపాయలను అందిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని అన్నారు.

కార్యక్రమంలో ఎంపీడీఓ గోపాలకష్ణ, ఎంపీఓ గౌస్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ఏపీఎం చిన్నయ్య, కళ్యాపూర్‌ సర్పంచ్‌ కాశం నీరంజని, రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు, మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌, ఐకేపీ సీసీ శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *