Breaking News

Daily Archives: November 5, 2019

ప్రజా సమస్యలపై పోరాడుతాం

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ సమస్యలపై బీజేపీ చేపట్టిన పాదయాత్ర 4వ రోజు కాటిపల్లి రమణా రెడ్డి నాయకత్వంలో కామారెడ్డి పట్టణంలోని 3వ వార్డు నుండి 12వ వార్డు వరకు అన్ని కాలనీలలో చేపట్టారు. ఈ సందర్బంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ గతంలో ఏలిన నాయకులు చేసిన అభివద్ధిని చూద్దామని కామారెడ్డి పట్టణంలో గత 4 రోజులుగా పాదయాత్ర చేస్తే ఎటు పోయినా సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని, అస్తవ్యస్తంగా ఉన్న ట్రాఫిక్‌ వ్యవస్థ, ...

Read More »

ప్రభుత్వంలో విలీనం చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె 32 రోజు సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకుల పాదయాత్ర 4వ రోజు సదాశివనగర్‌ మండలానికి చేరుకుంది. వారిని ఆర్టీసీ కార్మికులు స్వాగతం పలికారు. ఆర్టీసీ కార్మికురాలు జ్ఞానేశ్వరి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 22 మంది కార్మికులు మరణించినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా కార్మికులను ప్రభుత్వంలో విలీనంచేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ నాయకుడు గణేష్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కొ కన్వీనర్‌ దువ్వాల నరేష్‌, ఆర్టీసీ ...

Read More »

నల్ల బ్యాడ్జిలతో నిరసన

రెంజల్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలో మంగళవారం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయ అధికారులు, సిబ్బంది తహసీల్దార్‌ విజయ రెడ్డిని హత్య చేసిన సంఘటనను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గోపాలకష్ణ మాట్లాడుతూ సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించవద్దని అన్నారు. సమస్య ఏదైనా ఉంటే ఉన్నతాధికారుల దష్టికి తీసుకు రావాలి తప్ప హత్యలు చేయడం అమానుషమన్నారు. మహిళా అధికారిపై ఇలాంటి ...

Read More »

తహసిల్దార్‌పై కలెక్టర్‌కు ఫిర్యాదు

రెంజల్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్‌ పాటించడం లేదని రెంజల్‌ ఎంపీపీ లోలపు రజినీ మంగళవారం జిల్లా కలెక్టర్‌కు పిర్యాదు చేశారు. మండలంలో ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు ఇచ్చే మర్యాద ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు అయిన మహిళా ప్రజాప్రతినిధులకు సమాచారం అందించకుండా, కళ్యాణలక్ష్మి, షాది ముబారక్‌, రైతులకు కొత్త పట్టా పాసు బుక్కులను పంపిణీ చేశారని అన్నారు. అంతేకాకుండా మండలంలో ఎటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా సమాచారం ఇవ్వడం లేదని ...

Read More »

విజయారెడ్డి సజీవదహనం పాశవికచర్య

రెంజల్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అబ్దుల్లాపూర్‌ మెట్‌ తహశిల్దార్‌ విజయారెడ్డిపై కిరోసిన్‌ పోసి సజీవదహనం చేయడంపై రెడ్డి సంక్షేమ సంఘం బోధన్‌ డివిజన్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తహసీల్దార్‌ విజయరెడ్డిని ప్రభుత్వ కార్యాలయంలోనే కిరోసిన్‌ పోసి హత్యకు పాల్పడడం పాశవిక చర్యగా పేర్కొన్నారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి నిందితులను ఉపేక్షించకూడదని ...

Read More »

అక్రమ మైనింగ్‌ నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు అరవింద్‌ ధర్మపురి అధికారులను కోరారు. ప్రగతి భవన్‌లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమీక్షించేందుకు జిల్లా అభివ ద్ధి సమన్వయ మరియు మానిటరింగ్‌ కమిటీ దిశ సమావేశం ఎంపీ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో హౌసింగ్‌ మైనింగ్‌, స్వచ్ఛభారత్‌, ప్రధానమంత్రి సడక్‌ యోజన రూర్బన్‌ ఫసల్‌ బీమా, మిషన్‌ భగీరథ కార్యక్రమాలపై ...

Read More »

దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్రై సైకిల్స్‌ పంపిణీ

నిజామాబాద్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత గల దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్రైసైకిల్స్‌ అందజేయడానికి కషి చేద్దామని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌ తెలిపారు. మంగళవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని నాగారం క్రీడల స్టేడియంలో ఏ.డి.ఐ.పి. పథకం కింద దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్రై సైకిల్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అసిస్టెన్స్‌ ఫర్‌ డిజేబుల్డ్‌ పర్సన్స్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 25 వేల రూపాయల సబ్సిడీ అంద ...

Read More »

విధులు బహిష్కరించిన రెవెన్యూ సిబ్బంది

నందిపేట్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ తహసీల్‌ కార్యాలయానికి మంగళవారం తాళం వేసి తహసిల్దార్‌ విజయరెడ్డి సజీవదహనాన్ని నిరసించారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల బంద్‌ పిలుపు మేరకు రెవిన్యూ సిబ్బంది మంగళవారం తహసీల్‌ కార్యాలయం బంద్‌ చేసి విజయ రెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు. నందిపేట్‌ తహసీల్దార్‌ అలివేలును ఫోన్లో సంప్రదించగా రెవెన్యూ అధికారులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ విధులు బహిష్కరించి అంత్యక్రియలకు హాజరైనట్టు తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరారు. తహసిల్‌ కార్యాలయానికి తాళం ...

Read More »

ప్రమాదకరంగా విద్యుత్‌ వైర్లు

నందిపేట్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని బర్కత్‌పుర కాలనీలో విద్యుత్‌ వైర్లు ప్రమాదకరంగా మారాయి. రోడ్డు మధ్యలో విద్యుత్‌ వైర్లు వేలాడుతూ ఉండడంతో ఏ రోజు ఏ అపాయం ముంచుకొస్తుందో తెలియక విద్యుత్‌ వినియోగదారులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నడుచుకుంటున్నారు. వేలాడుతున్న వైర్లను సరిచేయాలని ప్రజలు ఎన్నిసార్లు విద్యుత్‌ అధికారులను విన్నవించుకున్నా పట్టించుకోవడంలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాడుతున్న వైర్లతో ఏదైనా ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. వేలాడుతున్న వైర్లను తక్షణమే ...

Read More »