దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్రై సైకిల్స్‌ పంపిణీ

నిజామాబాద్‌, నవంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత గల దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్రైసైకిల్స్‌ అందజేయడానికి కషి చేద్దామని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌ తెలిపారు. మంగళవారం జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని నాగారం క్రీడల స్టేడియంలో ఏ.డి.ఐ.పి. పథకం కింద దివ్యాంగులకు బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్రై సైకిల్‌ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

అసిస్టెన్స్‌ ఫర్‌ డిజేబుల్డ్‌ పర్సన్స్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 25 వేల రూపాయల సబ్సిడీ అంద చేసిందని, మరో రూ.12 వేలు ఎంపీ అభివద్ధి నిధుల కింద గత సంవత్సరం మంజూరు చేయడం జరిగిందని, ఇందుకై 2018లో సదరం శిబిరాలు నిర్వహించి 471 మందిని అర్హులుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరిలో ప్రస్తుతం 353 మందికి బ్యాటరీతో కూడిన ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తున్నామన్నారు.

ఈ పథకం కింద అర్హులకు శాసనసభ సభ్యులు లేదా పార్లమెంటు సభ్యుల నిధుల నుండి రూ. 12 వేలు మంజూరు చేస్తే మరో రూ. 25 వేలు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, తద్వారా దివ్యాంగులకు వాహనాలను సమకూర్చవచ్చన్నారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే శాసన సభ్యులు కానీ ఎంపీకి గాని దరఖాస్తు చేసుకోవాలని ఎన్ని దరఖాస్తులు వచ్చినా కూడా అర్హులు ఉంటే నిబంధనల మేరకు వాహనాలు సమకూర్చడానికి అవకాశముందని, వీరిని ప్రోత్సహించడానికి అందరం కషి చేద్దామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ, దివ్యాంగులకు వాహనాలు నడిపే కష్టం ఉండకుండా బ్యాటరీ ఆపరేటెడ్‌ ట్రై సైకిళ్లను ప్రస్తుతం పంపిణీ చేస్తున్నామని, గతంలో వీటికి మాజీ ఎంపీ ప్రతిపాదనలు చేశారన్నారు. లబ్ధిదారులను ఎంపిక చేయడానికి పత్యేక క్యాంపులు నిర్వహించామని, వీటి పంపిణీకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అలిమ్‌కో వాహనాలను సమకూర్చిందని తెలిపారు.

కార్యక్రమంలో జడ్పి చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు మాట్లాడుతూ ఎన్నికల వరకే రాజకీయాలని తర్వాత అందరం కలిసి ప్రజల సేవకు పార్టీలకతీతంగా పని చేద్దామని, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కషివల్ల వాహనాలను ఈరోజు పంపిణీ చేసుకుంటున్నామని తెలిపారు.

అంతకుముందు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు సైకిళ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి స్రవంతి, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, రెడ్‌కో చైర్మన్‌ అలీమ్‌, అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Check Also

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *