Breaking News

అక్రమ మైనింగ్‌ నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు అరవింద్‌ ధర్మపురి అధికారులను కోరారు. ప్రగతి భవన్‌లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమీక్షించేందుకు జిల్లా అభివ ద్ధి సమన్వయ మరియు మానిటరింగ్‌ కమిటీ దిశ సమావేశం ఎంపీ అధ్యక్షతన జరిగింది.

సమావేశంలో హౌసింగ్‌ మైనింగ్‌, స్వచ్ఛభారత్‌, ప్రధానమంత్రి సడక్‌ యోజన రూర్బన్‌ ఫసల్‌ బీమా, మిషన్‌ భగీరథ కార్యక్రమాలపై కమిటీ సమీక్షించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాల వలన వంట నష్టం వాటిల్లిన నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతుతో కొనుగోలు చేయాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో గన్ని బ్యాగ్‌ స్టోరేజ్‌ చెల్లింపులు విషయంలో ఎలాంటి సమస్యలు ఇబ్బందులు ఎదురు కాకుండా ముందస్తు ప్రణాళిక చేయాలన్నారు.

సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేసి ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా రైతులకు ప్రయోజనం కలిగే విధంగా తేమశాతంపై చూసి చూడనట్టు ఉదారంగా కొనుగోలు చేసేందుకు కషిచేయాలని చెప్పారు. పంట నష్టాన్ని ఫసల్‌ బీమా పరిహారాన్ని అందించాలన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్‌ పేట్‌ మండల తహసిల్దార్‌ విజయరెడ్డిపై జరిగిన దాడి అమానుషమని, బాధాకరమైన సంఘటనను ఖండిస్తున్నామన్నారు.

భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో విజయరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. సామాన్యుడికి ఇసుక సులభంగా దొరికే విధంగా చర్య తీసుకోవాలని జిల్లాలో 15 ఇసుక రీచ్‌లు ఆపరేట్‌ అవుతున్నందున అందరికీ ఇసుక లభ్యమయ్యే విధంగా అధికారులు కషి చేయాలన్నారు. ఇసుక రీచ్‌లు ఇక్కడ ఎక్కడ ఉన్నాయో వాటిని సభ్యులకు తీసుకోని పోయి వివరించాలని కోరారు.

అక్రమ మైనింగ్‌ నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. గనుల క్వారీ తవ్వకాలతో కేటాయించిన అగ్రిమెంట్‌ విస్తీర్ణం కంటే ఎక్కువగా త్రవ్వకాలు జరగకుండా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని సభ్యులు సూచించారు. ప్రధానమంత్రి సడక్‌ యోజన పథకం కింద మంజూరైన రోడ్లను సత్వరమే పూర్తిచేయాలని ఎంపీ అన్నారు. రూర్బన్‌ పథకంలో ఎడపల్లి మండలం ఎంపికైన దృష్ట్యా టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి వెంటనే పనులను చేపట్టాలన్నారు.

జిల్లా పరిషత్‌ చైర్మెన్‌ దాదన్న గారి విఠల్‌ రావు మాట్లాడుతూ గ్రామపంచాయతీ 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో రాజకీయాలకు అతీతంగా పాల్గొని ఆదర్శంగా నిలిచారన్నారు. అధికారుల, ప్రజల సహకారంతో స్థానిక ప్రజాప్రతినిధులు కషి చేస్తారని ఈ కార్యక్రమం ఆరంభం మాత్రమేనని ఇది నిరంతర పక్రియ అన్నారు. అందరి సమిష్టి కషితో రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా ఎదిగితే ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తుందని అన్నారు.

తహసీల్దార్‌ విజయరెడ్డి ఘటన హేయమైన చర్య అని దీన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్‌ రహిత జిల్లాగా గుర్తింపు వచ్చేందుకు కషి చేయాలన్నారు. ప్లాస్టిక్‌ వాడకం నిషేదించేందుకు దిశ సమావేశంలో తీర్మానం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ కురిసినందున వరి సాగు విస్తీర్ణం కూడా పెరిగిన దష్ట్యా పండించిన పంటకు మద్దతు ధర కల్పించేందుకు జిల్లాలో 310 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

రైతులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండ సహకార వ్యవసాయ సివిల్‌ సప్లై రెవెన్యూ శాఖల సమన్వయంతో ముందుకు పోతున్నట్లు చెప్పారు. అవసరమైన గన్ని బ్యాగుల రవాణా కోసం వాహనాలు, స్టోరేజ్‌, మౌలిక సదుపాయాలు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాలో ఇసుక కొరత లేకుండ పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ పథకాల పనుల కోసం ఇసుక కొరత లేదన్నారు.

జిల్లాలో 15 రీచ్‌లు ఆపరెట్‌ చేస్తున్నట్లు చెప్పారు. మొరం క్వారీ త్రవ్వకాల నిర్దేశించిన ఏరియా కంటే అక్రమంగా తలించించిన వారిపై చట్టరీత్య చర్యలు తప్పవని చెప్పారు. రెండు పడకల గదుల కేటాయింపు పారదర్శకంగా గ్రామ సభల ద్వారా ఎంపిక చేస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిఅర్‌డిఎ రాథోడ్‌ రమేష్‌, కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

నగర మేయర్‌ ఆధ్వర్యంలో రక్తదానం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని రెడ్‌ క్రాస్‌ సొసైటీలో రక్త నిధుల‌ కొరత ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *