Breaking News

విలీన గ్రామాల సమస్యలు తెలుసుకోవాలి

కామారెడ్డి, నవంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ సమస్యలపై బీజేపీ చేపట్టిన పాదయాత్ర 5 వ రోజు కాటిపల్లి రమణా రెడ్డి నాయకత్వంలో టెక్కిరియల్‌, అడ్లూరు గ్రామాల్లో చేపట్టారు.

ఈ సంధర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణా రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలు అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయన్నారు. మున్సిపల్‌లో కలిసి దాదాపు ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటికి ప్రజాప్రతినిధులు లేకపోవటంతో ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.

అధికారులు విలీన గ్రామాల వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్నారు. ప్రజలు సమస్యల పరిష్కారానికి దళారులను ఆశ్రయించాల్సి వస్తుందని, ఇకనైనా మున్సిపల్‌ అధికారులు వారంలో ఒక రోజు విలీన గ్రామాల్లో సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Check Also

రైతుల‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు.

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నియంత్రిత వ్యవసాయం గురించి తమకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *