Breaking News

8న కలెక్టరేట్‌ వద్ద ధర్నా

కామారెడ్డి, నవంబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం మాజీ మంత్రి వర్యులు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో షబ్బీర్‌ అలీ నివాసంలో కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు మాజీ సిడిసి అధ్యక్షులు కారంగుల అశోక్‌ రెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం (బిజెపి) అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 8 వ తేదీన జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.

ప్రతీ కాంగ్రెస్‌ కార్యకర్త, యువజన కాంగ్రెస్‌ నాయకులు, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు, మహిళా కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

Check Also

రైతుల‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు.

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నియంత్రిత వ్యవసాయం గురించి తమకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *