వర్షాలకు దెబ్బతిన్న పంటల రైతులు ఆందోళన చెందవద్దు

నిజామాబాద్‌, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి పంటల రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాసనసభ వ్యవహారాలు గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ముప్కాల్‌ మండలం నల్లూరు గ్రామ శివారులో కోమటి రెడ్డి శేఖర్‌ రెడ్డికి చెందిన నష్ట పోయిన వరి పంటను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో తాత్కాలికంగా సుమారు 22 వేల ఏకరాలు వరి పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేయాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. జిల్లాలో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్‌ రైస్‌ మిల్లులు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఏ ఏరియాలో ఎంత తడిసిన ధాన్యం వస్తుందో ముందుగా అంచనా వేసి కొనుగోలు కేంద్రాల నుండే నేరుగా ఏ రైస్‌ మిల్లులకు పంపించే ఏర్పాట్లు చేయాలన్నారు.

తడిసిన ధాన్యం కొనుగోలులో ఏలాంటి సమస్యలు ఇబ్బందులు తలెత్తకుండా రైస్‌ మిల్లుల యజమానులతో పాటుగా డిసిఓ సివిల్‌ సప్లై వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్‌ సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లాలో 225 రైస్‌ మిల్లులలో 66 బాయిల్డు రైస్‌ మిల్లులో కలవని జిల్లాలో తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇబ్బంది ఉండక పోవచ్చునని కలెక్టర్‌ మంత్రికి వివరించారు.

అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన నేపథ్యంలో పంట భీమా ద్వారా రైతులకు సహాయం పొందే విధంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మంత్రి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పంట భీమా మండల యూనిట్‌ కాకుండా వ్యక్తిగతంగా యూనిట్‌ తీసుకొని నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

మంత్రి వెంట జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు, డిఏం సివిల్‌ సప్లై అభిషేక్‌ సింగ్‌, జేడిఏ గోవింద్‌, ఏడి మార్కెటింగ్‌ రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *