‘గోర్‌ జీవన్‌’ గోడపత్రుల ఆవిష్కరణ

నిజాంసాగర్‌, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి డివిజన్‌ కేంద్రంలో బంజారా భాషలో వస్తున్న గోర్‌ జీవన్‌ గోడపత్రులను గురువారం ఎల్లారెడ్డి మండల బంజారా సేవా సంఘం అధ్యక్షుడు రాథోడ్‌ లింభేష్‌ నాయక్‌, జిల్లా ఉపాధ్యక్షుడు యశ్వంత్‌ రావు ఆవిష్కరించారు. హీరో కేపీయం చౌహన్‌, హీరోయిన్‌ మంగ్లీ, చమ్మక్‌ చంద్ర నటిస్తున్న సినిమాలో బంజారాల జీవన విధానాన్ని చక్కగా చూపడం సంతోషకర విషయమన్నారు.

బంజారా భాషలో బంజారా యువకులు నటిస్తూ మొదటిసారిగా రూపొందించిన గోర్‌ జీవన్‌ సినిమా శనివారం ఎల్లారెడ్డి లక్ష్మీ టాకీస్‌లో విడుదల కానుందన్నారు. సినిమాను బంజారాలందరూ ప్రతి మండల గిరిజనులు, తండా వసూలు తప్పకుండా ఆదరించాలని వారు కోరారు. అలాగే శనివారం ఉదయం ఎల్లారెడ్డి పట్టణంలో గోర్‌ జీవన్‌ సినిమాలో నటించిన హీరో చౌహన్‌, హీరోయిన్‌ మంగ్లీ, చమ్మక్‌ చంద్రను భారీ ర్యాలీతో స్వాగతం పలకనున్నారని వారు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా గిరిజన యూత్‌ అధ్యక్షుడు ఓంకార్‌ నాయక్‌, లంబాడీ ఐక్యవేదిక మండల అధ్యక్షుడు రాంసింగ్‌ నాయక్‌, బంజారా యూత్‌ సభ్యులు సురేష్‌ నాయక్‌, రమేష్‌, కిరణ్‌, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *