రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మతి

నందిపేట్‌, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం బజార్‌ కొత్తూరు గ్రామంలోని ప్రధాన రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల కేంద్రంలోని మూడ దేవన్న (55) అనే వ్యక్తి మతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మతుడు మూడ దేవన్న టివిస్‌ మోపేడ్‌ బైక్‌పై ఉమ్మెడ నుంచి నందిపేట్‌ కు వెళ్తుండగా ఇదే రూట్లో నందిపేట్‌ నుండి బాద్గుణ వైపు వెళ్తున్న ఐచర్‌ వాహనానికి తగిలి టివిఏస్‌ బైక్‌ క్రింద పడడంతో ఐచార్‌ వెనుక టైర్‌ శరీరంపై నుంచి వెళ్ళింది.

దీంతో దేవన్న అక్కడిక్కడే మతి చెందాడు. ఎస్‌ఐ రాఘవేందర్‌ తన సిబ్బందితో వచ్చి మతదేహాన్ని జిల్లా కేంద్రంలోని సర్కారు దవాఖానకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న దేవన్న కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Check Also

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *