వారం రోజల్లో పనులు ప్రారంభించాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :

సిరికొండ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని సంధ్యారాణి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు పునాది-2 కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బేస్‌ లైన్‌ పరీక్షను పర్యవేక్షించారు.

విద్యార్థులకు కనీస సామర్థ్యాల, నైపుణ్యాల అభివద్ధి కోసం పునాది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో గల బాత్రూమ్‌, టాయిలెట్‌ల కొరతతో పాటు పలు సమస్యల గురించి ప్రధానోపాధ్యాయురాలు కల్పన ఆమె దష్టికి తీసుకువచ్చారు.

వెంటనే స్పందించిన గిరిజన సంక్షేమ అధికారిణి సంధ్యారాణి సంబందిత శాఖ అధికారులకు ఫోన్‌ చేసి వారం రోజుల్లో పనులు ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో దర్పల్లి సిఐ ప్రసాద్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్పన, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Check Also

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *