Breaking News

బలహీన వర్గాల అభివృద్దియే ధ్యేయం

నిజాంసాగర్‌, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు బలహీన వర్గాల అభివద్ధి దేయంగా తెలంగాణ ప్రభుత్వం కషి చేస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు, గహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

ముప్కాల్‌ మండలం నల్లూరు గ్రామంలో పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఉద్యమించి తెలంగాణ సాధించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు.

మరుగున పడిన కులవత్తులపై ఆధారపడిన కుటుంబాలకు జీవనోపాధిని పెంపొందించడమే కాకుండా ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు కషి చేశారని చెప్పారు. పుట్టిన పిల్ల నుండి వద్ధుల వరకు పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం నిరుపేద వర్గాలకు అందిస్తున్న సేవలను గుర్తించాలని చెప్పారు.

ప్రభుత్వం ప్రజల అభివద్ధి కోసమే పనిచేస్తుందని, ప్రభుత్వం చేస్తున్న పలు సేవలను తెలిసి తెలియనట్లు ప్రజలు ప్రవర్తించ కూడదని, ఎవరో అబద్ధాలు అసత్యాలు చెప్పి మభ్య పెడుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఈ గ్రామంలో కేవలం 80 పింఛన్లు మాత్రమే మంజూరయ్యాయని, కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక 412 పెన్షన్లు మంజూరు చేశారని, ఇంకా ఆర్హత వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పారు.

పెన్షన్‌ కోసం 60 సంవత్సరాల నుండి 57 సంవత్సరాలకు తగ్గించిన అట్టి జాబితా కూడా సిద్దంగా ఉందని ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు పెన్షన్లను మంజూరు చేస్తారని చెప్పారు. 42 లక్షల అంచనా వ్యయంతో చెరువు మరమ్మతు పనులను చేపట్టినట్టు చెప్పారు. మున్నూరు కాపు గొల్లకుర్మలకు ఇతర కులాలకు కమ్యూనిటీ భవనం మంజూరు చేయడం జరిగిందని, మున్నూరు కాపులకు గతంలో మంజూరు చేసినా తిరిగి మరిన్ని నిధులు మంజూరు చేస్తానని చెప్పారు.

60 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మురుగు కాలువల నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు. 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక ప్రణాళికలు అందరి భాగస్వామ్యంతో విజయవంతం చేశారని, అదే స్ఫూర్తి మున్ముందు పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు కషిచేయాలని చెప్పారు. గ్రామ పంచాయతీల అభివద్ధికి ప్రతి నెల నిధులను నేరుగా మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.

గ్రామాభివద్ధికి సిసి రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి నిధులను మంజూరు చేయడం జరుగుతుందని, లోవోల్టేజీ సమస్య లేకుండా కోటి 30 లక్షలతో 33/11 విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ జిల్లా నియోజకవర్గ అభివద్ధికి సంక్షేమ పథకాల అమలులో మంత్రి ఎంతో కషి చేస్తున్నారని, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు ఒక టీంతో పనిచేస్తూ జిల్లాను అభివద్ధి పథంలో తీసుకెళ్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలు ప్రజలందరూ సహకరించాలని పరిసరాల పరిశుభ్రత విద్యుత్‌ మరమ్మతులు తదితర పనులను చేపట్టడం మూలంగా పల్లె వాతావరణం మారిపోయిందని, పరిసరాల పరిశుభ్రత వలన దోమలు లేకుండా ఉన్నాయంటూ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇదే స్ఫూర్తి కొనసాగించాలని, ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు.

మున్ముందు హరిత ఆరోగ్య నిజామాబాద్‌గా ఎదిగేందుకు ప్రతి ఒక్కరు సహకారం అందించాలని, అందరికి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందించాలని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి 5 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన పద్మశాలి భవనాన్ని ఐదు లక్షలతో చేపట్టిన విశ్వంత్‌ కుమార్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ గ్రంథాలయాన్ని మంత్రి ప్రారంభించారు.

7 లక్షల 50 వేల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఎస్‌సి కమ్యూనిటీ హాల్‌, 12 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న వైకుంఠ దామం నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. జ్యోతిరావు పూలే, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రైతులు ఇబ్బంది పడకుండా పండించిన పంటకు మద్దతు ధర కల్పించేందుకు గ్రామంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.

కార్యక్రమంలో ఎంపీపీ సామ పద్మ, జెడ్‌పిటిసి బడ్డం నర్సవ్వ, సర్పంచ్‌ సుగుణ, నారాయణ, డిఆర్‌డిఓ రాథోడ్‌ రమేష్‌, జెడి ఎ గోవిందు, డిఎం సివిల్‌ సప్లై అభిషేక్‌ సింగ్‌, ఏడి మార్కెటింగ్‌ రియాజ్‌, డిసిఓ సింహాచలం డీఎస్‌ఓ శ్రీ పద్మజా, జిల్లా వైద్యా ఆరోగ్య అధికారి సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

45 మందికి ఉపాధి అవకాశాలు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఆర్మూర్‌ పట్టణంలో ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *