Breaking News

గ్రామ పంచాయతికి ట్రాక్టర్‌ అందజేత

నిజాంసాగర్‌, నవంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణఖేడ్‌ మండలం నిజాంపేట్‌ గ్రామానికి 30 రోజుల అభివద్ధి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామ పంచాయతీలు ఇస్తున్న ట్రాక్టర్‌ను గ్రామ పంచాయతికి శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్‌ రెడ్డి గురువారం అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యేను గ్రామ సర్పంచ్‌ ఘనంగా సన్మానించారు. వారితో పాటుగా ఆత్మ కమిటీ చైర్మన్‌ రమావత్‌ రాం సింగ్‌, మండల జెడ్పిటిసి లక్ష్మీ బాయి – రవీంద్ర నాయక్‌, మండల వైస్‌ ఎంపీపీ సాయి రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు సాయి రెడ్డి, గ్రామ సర్పంచ్‌ జగదీశ్వరా చారి, ఉప సర్పంచ్‌ రాంచందర్‌, బంజారా సేవాలాల్‌ సంఘ అధ్యక్షుడు రమేష్‌ చౌహాన్‌ తదితర మండల నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Check Also

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర్‌ రావు జన్మదిన ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *