రెంజల్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్తీకమాస ఏకాదశి పురస్కరించుకొని మండలంలోని కందకుర్తి గోదావరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుండి భక్తులు గోదావరికి చేరుకొని నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. గోదావరి పరివాహక ప్రాంతమైన కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పిండివంటలు నైవేద్యంగా సమర్పించారు. దీపాలు వెలిగించి తెప్పలను గోదావరి నదిలో వదిలితే పాపాలు తొలగి పోతాయని భక్తుల నమ్మకం. పవిత్ర శుక్రవారం కావడంతో వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక ...
Read More »Daily Archives: November 8, 2019
అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులను సస్పెండ్ చేయాలి
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ సమ్మె సందర్బంగా నిజామాబాద్‌లో పోలీసులు శుక్రవారం అరెస్టు చేస్తున్న క్రమంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని లత, ఆర్టీసీ మహిళా ఉద్యోగి అరుందతిలను సిపిఎం, బిఎల్ఎఫ్ నేతలు పెద్ది వెంకట్రాములు, దండి వెంకట్ తదితరులు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడేరోజులు దగ్గర పడ్డాయన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సమ్మె ...
Read More »బీడీ కార్మిక నేతల అరెస్టు
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా శుక్రవారం తెలంగాణ బీడీ వర్కర్స్ యూనియన్ ఆద్వర్యంలో నిజామాబాదు నగరంలో బీడీ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నినాదాలు చేశారు. ధర్నా చౌక్ వద్ద ఆర్టీసి దీక్షా శిబిరానికి రాకుండా బీడీ కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం బీడీ కార్మిక నేత వి.కష్ణతో పాటు పిడిఎస్యు నేత సుధాకర్ తదితరులను అరెస్టు చేశారు.
Read More »చెక్కుల అందజేత
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 17 మంది లబ్దిదారులకు సంబందించిన మొత్తం ఆరు లక్షల నలబై రెండు వేల ఐదు వందల రూపాయల చెక్కులను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త అందజేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. తెరాస నాయకులు ఆకుల శ్రీశైలం, అంతరెడ్డి దేవేందర్ రెడ్డి, దండు శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Read More »సర్కారు మూల్యం చెల్లించక తప్పదు
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ సమ్మెలో భాగంగా శనివారం నాటి చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం దష్ట్యా పోలీసులు నిజామాబాదు ధర్నా చౌక్ దీక్ష శిబిరం వద్ద ప్రజా సంఘాలు, వివిద పార్టీల నేతలు, ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు. అరెస్టుల సందర్భంగా సిపిఐఎం నేత సబ్బని లత, ఆర్టీసి కార్మికురాలు అరుందతిలు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని ఆసుపత్రి కి తరలించారు. సమ్మె శిబిరంపై పోలీసుల దాడికి కేసిఆర్ సర్కార్ ...
Read More »కేంద్రం ఇచ్చిన మాట తప్పుతోంది
కామారెడ్డి, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ చేపట్టిన మహాధర్నాలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు చేసి మూడు సంవత్సరాలు అవుతుందని, ఒక్కో వ్యక్తి ఖాతాలో 14 లక్షల రూపాయలు వేస్తామని, 14 రూపాయలు కూడా వేయలేదన్నారు. ఎక్కడ కూడా చర్చించకుండా రాత్రికి రాత్రి నోట్ల రద్దు చేశారని, నోట్లు రద్దు చేసిన ...
Read More »రైతులు అధైర్యపడొద్దు
రెంజల్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అకాల వర్షానికి తడిసిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని జిల్లా కోపరేటివ్ అధికారి సింహాచలం అన్నారు. మండలంలోని దూపల్లి, రెంజల్, కందకుర్తి గ్రామాల్లో అకాల వర్షం ద్వారా నష్టపోయిన వరి పంటను ఆయన పరిశీలించారు. వర్షం కారణంగా నష్టపోయిన ప్రతి ధాన్యాన్ని జిల్లా సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేద్రాలలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, సకాలంలో డబ్బులను అందజేస్తామన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కందకుర్తి వద్ద ...
Read More »రీస్టార్ట్ ఏ హార్ట్ అంశంపై అవగాహన
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు మనోరమ ఆసుపత్రిలో శుక్రవారం ఇండియన్ సొసైటీ ఆఫ్ అనెస్తియాలజిస్ట్స్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆద్వర్యంలో ” రీస్టార్ట్ ఎ హార్ట్” అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖ మత్తు వైద్యనిపుణులు ఎ.శ్రీధర్ వక్తగా హాజరై మాట్లాడుతూ గుండెపోటు వచ్చినప్పుడు, రోడ్డు ప్రమాదాలు తదితర సంఘటనలు జరిగినప్పుడు చాలా మంది అపస్మారక స్థితిలోకి వెళ్తారన్నారు. అలాంటి వారిని తిరిగి స్పహలోకి తెచ్చేందుకు కొన్ని పద్దతులు పాటించాలని సూచించారు. అపస్మారక స్థితిలోకి వెళ్ళినవారిని ముందుగా ...
Read More »శాసనసభ ప్రాంగణంలో ఎస్బిఐ
బాన్సువాడ, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శాసనసభ ప్రాంగణంలో నూతనంగా నవీకరించిన భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ రావు, శాసనసభ్యులు, శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు, ఎస్బిఐ చీఫ్ జనరల్ మేనేజర్ ఓం ప్రకాష్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ...
Read More »కళ్లకు గంతలు కట్టుకొని నిరసన
కామారెడ్డి, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, పట్టణ అధ్యక్షుడు ఆకుల శివ కష్ణ మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, బస్సులు లేకపోవడంతో గ్రామీణ విద్యార్థులు వారి అమూల్యమైన విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నూతన ఉద్యోగాలు ...
Read More »ప్లాస్టిక్ నిర్మూలనకు చర్యలు
నిజామాబాద్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన ఛాంబర్లో నగరపాలక సంస్థకు చెందిన ఇంజనీర్లు శానిటేషన్ అధికారులతో నగర పరిశుభ్రతపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని వ్యాపార వాణిజ్య దుకాణాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను వాడుతున్నారని, నేపథ్యంలో వారిపై చివరి హెచ్చరిక జారీ చేసి పునరావతం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ...
Read More »రాష్ట్రస్థాయికి ఎంపికైన గురుకుల విద్యార్థులు
నిజాంసాగర్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి మాథ్స్ సైన్స్ ఫెయిర్‌కు ఎంపికైనట్లు కామారెడ్డి గురుకులాల సమన్వయ అధికారి గుమీడేల్లి మహేందర్ తెలిపారు. మంచిర్యాల్ జిల్లా లక్సెట్టిపేట్‌లో ఈ నెల 4 నుండి 5 వరకు జోనల్ స్ధాయి మాథ్స్ సైన్స్ ఫెయిర్‌లో పాఠశాల నుండి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆర్.రజనీకాంత్, సీ.ఎచ్.నందు ”అప్లికేషన్ ఆఫ్ కొనిక్ సెక్షన్” మాథమాటిక్స్ సైన్స్ ఫెయిర్ నిర్మల్, మంచిర్యాల, ...
Read More »చాలా సమస్యలున్నాయి
కామారెడ్డి, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి పరిధిలోని 1వ వార్డు నుండి 49 వార్డుల వరకు విలీన గ్రామాలతో కలిపి మున్సిపాలిటీ సమస్యలపై గత 6 రోజులు పాదయాత్ర చేపట్టడం జరిగిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణారెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పాదయాత్రలో ప్రజలు తమకు చెప్పిన సమస్యలు, తాము స్వయంగా చూసిన సమస్యలను క్లుప్తంగా మీడియా ద్వారా ...
Read More »భారత్ పెట్రోలియం బంక్‌ను ప్రారంభించిన సుదర్శన్‌రెడ్డి
రెంజల్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని సాటాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన భారత్ పెట్రోలియం బంక్‌ను శుక్రవారం మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో సాటాపూర్ గ్రామంలో భారత్ పెట్రోలియం బంక్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని రెంజల్ మండల ప్రజలకు అందుబాటులో ఉపయోగకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో భారత్ పెట్రోలియం మేనేజర్ గున్నారవ్, హరీష్ పహడియా, టిపిసిసి అధికార ప్రతినిధి కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శులు గడుగు గంగాధర్, మహేష్ కుమార్ ...
Read More »