గోదావరికి భక్తుల తాకిడి

రెంజల్‌, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్తీకమాస ఏకాదశి పురస్కరించుకొని మండలంలోని కందకుర్తి గోదావరి క్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుండి భక్తులు గోదావరికి చేరుకొని నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు.

గోదావరి పరివాహక ప్రాంతమైన కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి పిండివంటలు నైవేద్యంగా సమర్పించారు. దీపాలు వెలిగించి తెప్పలను గోదావరి నదిలో వదిలితే పాపాలు తొలగి పోతాయని భక్తుల నమ్మకం. పవిత్ర శుక్రవారం కావడంతో వివిధ ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

Check Also

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *