రైతులు అధైర్యపడొద్దు

రెంజల్‌, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షానికి తడిసిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని జిల్లా కోపరేటివ్‌ అధికారి సింహాచలం అన్నారు. మండలంలోని దూపల్లి, రెంజల్‌, కందకుర్తి గ్రామాల్లో అకాల వర్షం ద్వారా నష్టపోయిన వరి పంటను ఆయన పరిశీలించారు.

వర్షం కారణంగా నష్టపోయిన ప్రతి ధాన్యాన్ని జిల్లా సహకార సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేద్రాలలో ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, సకాలంలో డబ్బులను అందజేస్తామన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కందకుర్తి వద్ద చెక్‌ పోస్టును ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించారు.

మహారాష్ట్ర ప్రాంతం నుండి సోయా, వరి ధాన్యాన్ని దిగుమతులు జరుపరాదని అన్నారు. ఆయన వెంట మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు లతీఫ్‌, రైతుసమన్వయ సమితి జిల్లా సభ్యుడు మౌలానా, వ్యవసాయ అధికారి లాక్ష్మీకాంత్‌ రెడ్డి, టిఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

Check Also

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *