Breaking News

శాసనసభ ప్రాంగణంలో ఎస్‌బిఐ

బాన్సువాడ, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ప్రాంగణంలో నూతనంగా నవీకరించిన భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ శాఖను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.

శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్‌ రావు, శాసనసభ్యులు, శాసనసభ కార్యదర్శి డా. వి. నరసింహా చార్యులు, ఎస్‌బిఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓం ప్రకాష్‌ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ శాసనసభ్యులు తమ నగదు లావాదేవీలు నిర్వహించుకోవడానికి అసెంబ్లీ ప్రాంగణంలోని బ్రాంచీ వీలుగా ఉంటుందన్నారు.

శాఖను నవీకరించడంతో పాటు విస్తరించడంతో మరింతగా మెరుగైన సేవలను అందించవచ్చునన్నారు. తన బ్యాంక్‌ అకౌంట్‌ కూడా ఈ శాఖలోనే ఉందన్నారు. ఎలాంటి పిర్యాదులు లేకుండా ఇక్కడి సిబ్బంది తమ కస్టమర్లకు నాణ్యమైన సేవలను అందిస్తున్నారని అభినందించారు.

ఈ సందర్భంగా హుజూర్‌ నగర్‌ శాసనసభ స్థానం నుండి నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డికి నూతన ఖాతా పుస్తకాన్ని స్పీకర్‌ పోచారం, ముఖ్య అతిధులు అందించారు.

Check Also

పారుడు వ్యాధి రాకుండా నివారణ టీకాలు

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పారుడు వ్యాధి రాకుండా నివారణ టీకాల‌ను ప్రభుత్వం ఉచితంగా ...

Comment on the article