రాష్ట్రస్థాయికి ఎంపికైన గురుకుల విద్యార్థులు

నిజాంసాగర్‌, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు రాష్ట్ర స్థాయి మాథ్స్‌ సైన్స్‌ ఫెయిర్‌కు ఎంపికైనట్లు కామారెడ్డి గురుకులాల సమన్వయ అధికారి గుమీడేల్లి మహేందర్‌ తెలిపారు.

మంచిర్యాల్‌ జిల్లా లక్సెట్టిపేట్‌లో ఈ నెల 4 నుండి 5 వరకు జోనల్‌ స్ధాయి మాథ్స్‌ సైన్స్‌ ఫెయిర్‌లో పాఠశాల నుండి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆర్‌.రజనీకాంత్‌, సీ.ఎచ్‌.నందు ”అప్లికేషన్‌ ఆఫ్‌ కొనిక్‌ సెక్షన్‌” మాథమాటిక్స్‌ సైన్స్‌ ఫెయిర్‌ నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి జిల్లాల విద్యార్థులు పాల్గొన్నారన్నారు. తమ పాఠశాలకు జోనల్‌ స్థాయిలో ద్వితీయ బహుమతి సంపాదించి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు మహేందర్‌ తెలిపారు.

మాథమాటిక్స్‌ సైన్స్‌ ఫెయిర్‌లో న్యాయ నిర్ణేతలతో ”శభాష్‌” అనిపించుకున్నారని ప్రిన్సిపాల్‌ వివరించారు. ఇదిలా ఉండగా విద్యార్థులకు జోనల్‌ స్థాయిలో బహుమతులు సంపాదించినందుకు ఇందుకు ప్రోత్సహిస్తున్న మాథ్స్‌ టీచర్స్‌ ఎం. నరేషకుమార్‌, జి. శ్రీనివాస్‌, సమీన ఫెరదౌసి, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వర్‌, జూనియర్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ నవీన్‌ను డి.సి.ఓ జీ.మహేందర్‌ అభినందించారు.

Check Also

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *