Breaking News

అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీసులను సస్పెండ్‌ చేయాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ సమ్మె సందర్బంగా నిజామాబాద్‌లో పోలీసులు శుక్రవారం అరెస్టు చేస్తున్న క్రమంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి సబ్బని లత, ఆర్టీసీ మహిళా ఉద్యోగి అరుందతిలను సిపిఎం, బిఎల్‌ఎఫ్‌ నేతలు పెద్ది వెంకట్రాములు, దండి వెంకట్‌ తదితరులు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్‌ నియంత పాలనకు చరమగీతం పాడేరోజులు దగ్గర పడ్డాయన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో సమ్మె శిబిరంలో ఉన్న నాయకులను కార్మికులను అరెస్టు చేసే సందర్భంగా పోలీసులు సబ్బని లత కడుపులో బూటు కాళ్ళతో తన్నడం మూలంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వెల్లడించారు. అరెస్టు సందర్భంగా అతి ఉత్సాహం ప్రదర్శించిన పోలీసు అదికారులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Check Also

రైతుల‌కు అందుబాటులో ఉంటా

రెంజల్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల‌కు అందుబాటులో ఉంటూ రైతుల‌ అభివృద్ధి కోసం నిరంతరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *