చాలా సమస్యలున్నాయి

కామారెడ్డి, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి పరిధిలోని 1వ వార్డు నుండి 49 వార్డుల వరకు విలీన గ్రామాలతో కలిపి మున్సిపాలిటీ సమస్యలపై గత 6 రోజులు పాదయాత్ర చేపట్టడం జరిగిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణారెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

పాదయాత్రలో ప్రజలు తమకు చెప్పిన సమస్యలు, తాము స్వయంగా చూసిన సమస్యలను క్లుప్తంగా మీడియా ద్వారా అధికారుల దృష్టికి తీసుకు వస్తున్నామన్నారు. పారిశుద్యం విషయంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి ఉందని రమణారెడ్డి పేర్కొన్నారు. పట్టణంలో అనేక చోట్ల రోడ్లు గుంతల మయం అయ్యాయని, కొన్ని చోట్ల ఉన్న రోడ్ల పైననే రోడ్లు వేస్తున్నారు కానీ అవసమైన కొన్ని కాలనీల్లో అసలే పట్టించుకోలేదన్నారు.

కొన్ని చోట్ల కల్వర్టులకు రంద్రాలు పడ్డాయి వాటిని పునర్నిర్మించాల్సి ఉందని, కొన్ని చోట్ల వీధి దీపాలు లేవు, ఉన్న చోట్లలో వెలగటం లేదన్నారు. పుష్కలంగా వర్షాలు పడ్డప్పటికీ కొన్ని చోట్ల నీటి సమస్య ఉందని, కామారెడ్డి పట్టణానికి సంబంధించిన ట్రాఫిక్‌ నిబంధనలు, యూ టర్న్‌ల విషయంలో కూడా పునరాలోచిస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని రమణారెడ్డి వివరించారు.

Check Also

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *