రీస్టార్ట్‌ ఏ హార్ట్‌ అంశంపై అవగాహన

నిజామాబాద్‌, నవంబర్‌ 8

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు మనోరమ ఆసుపత్రిలో శుక్రవారం ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ అనెస్తియాలజిస్ట్స్‌ నిజామాబాద్‌ జిల్లా శాఖ ఆద్వర్యంలో ” రీస్టార్ట్‌ ఎ హార్ట్‌” అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖ మత్తు వైద్యనిపుణులు ఎ.శ్రీధర్‌ వక్తగా హాజరై మాట్లాడుతూ గుండెపోటు వచ్చినప్పుడు, రోడ్డు ప్రమాదాలు తదితర సంఘటనలు జరిగినప్పుడు చాలా మంది అపస్మారక స్థితిలోకి వెళ్తారన్నారు.

అలాంటి వారిని తిరిగి స్పహలోకి తెచ్చేందుకు కొన్ని పద్దతులు పాటించాలని సూచించారు. అపస్మారక స్థితిలోకి వెళ్ళినవారిని ముందుగా సురక్షితమైన స్థలంలో పడుకోబెట్టాలన్నారు. 15 సెకన్లలో 30 సార్లు చాతి కుదింపులు చేయాలన్నారు.

ఇలా చేయడం వల్ల చాలా సందర్భాలలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిన వారు స్ఫ్రహలోకి వచ్చే అవకాశముందన్నారు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఈ పద్దతి ద్వారా 30 శాతం మంది బతికారని చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్‌ మనోరమతో పాటు ఆసుపత్రి వైద్యులు, సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

ప్రమాదవశాత్తు బాలుడు మతి

రెంజల్‌, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా గ్రామశివారులోని పసుపు వాగులో ప్రమాదవశాత్తు జారిపడి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *