Breaking News

ప్రతి ఒక్కరూ హక్కులపై అవగాహన కలిగి ఉండాలి

రెంజల్‌, నవంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరు హక్కులపై అవగాహన కలిగి ఉండాలని ఎంపీపీ లోలపు రజినీ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బాలల హక్కుల వారోత్సవాల్లో పాల్గొని విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు.

ప్రతి విద్యార్థి హక్కులు తెలుసుకోవాలని, బాలల హక్కుల చట్టం గురించి అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం బాలల హక్కుల పరిరక్షణ కొరకు విద్యార్థులతో కలిసి మండలకేంద్రంలోని ప్రధాన వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు.

కార్యక్రమంలో ఎంఈవో గణేష్‌ రావ్‌, అంగన్‌వాడి సూపర్‌వైజర్‌ ప్రమీల రాణి, అంగన్‌వాడి ఉపాధ్యాయులు సురేఖ, రాజ్యలక్ష్మి, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

బీజేపీ మండల అధ్యక్షుడుగా చుక్క రాజు

రెంజల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని నీలా క్యాంపులో బుధవారం జరిగిన బీజేపీ మండలస్థాయి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *