Breaking News

తుది తీర్పు

  • వివాదాస్పద స్థలం హిందువులదే
  • మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యావత్‌ భారతదేశం ఉత్కంఠతో ఎదురుచూసిన అయోధ్య రామజన్మభూమి వివాదానికి తెరపడింది. అయోధ్యలోని బాబ్రీ మసీదు, రామజన్మభూమి స్థలంపై నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెల్లడించింది.

కాగా ఇప్పటిదాకా రెండోస్థానంలో ఉన్న ఆధార్‌ కేసు దాటి అయోధ్య కేసు 40 రోజుల సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. అయోధ్యలో 2.77 ఎకరాల భూ వివాదం కేసును ఆగష్టు 6 నుంచి అక్టోబర్‌ 16 వరకు విచారించిన సుప్రీంకోర్టు శనివారం చారిత్రక తీర్పు వెల్లడించింది. వివాదాస్పద భూమి హిందువులదేనని, మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వాలను ఆదేశించింది.

Check Also

‘తెలంగాణ రత్న’ పురస్కారానికి దరఖాస్తుల‌ ఆహ్వానం

హైదరాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 14వ ...

Comment on the article