Breaking News

భారీ బందోబస్తు

నందిపేట్‌, నవంబర్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అయోధ్య తీర్పు నేపథ్యంలో నందిపేట్‌ మండలంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం నుండే స్థానిక ఎస్‌ఐ రాఘవేందర్‌ ఆధ్వర్యంలో మండలంలోని మసీదులు మందిరాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో గస్తీ ముమ్మరం చేశారు.

ఆర్మూర్‌ రూరల్‌ సిఐ విజయ కుమార్‌ నందిపేట్‌ పరిస్థితిని పరిశీలించారు. యువకులు గుంపులుగా ఉండడం, గ్రూపులుగా తిరగడం, ర్యాలీలు, విజయ ఉత్సవాలు నిషేధంగా ఉందన్నారు. అదేవిధంగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, సామాజిక మాధ్యమాల్లో కూడా తీర్పు అనుకూలంగా గాని, ప్రతికూలంగా గాని పోస్టులు పెట్టకూడదని పోలీస్‌ అధికారులు సూచించారు.

ఎవరైనా దిక్కరిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. గతంలో జరిగిన సంఘటనల దష్ట్యా పోలీసు అధికారులు ఇక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Check Also

మాస్కులు, శానిటీజర్లు అందజేసిన జనవిజ్ఞాన వేదిక

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ వారు 1000 ...

Comment on the article